కేసీఆర్ నాయకుడు కాదు 420 ... బిజెపితో కలిసే కొత్త సినిమా: షర్మిల సంచలనం
వరంగల్ : ఈ జన్మకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కమాట కూడా నిలబెట్టుకోలేదని...
వరంగల్ : ఈ జన్మకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కమాట కూడా నిలబెట్టుకోలేదని... ఆయనను నాయకుడు అనేకంటే 420 అనడమే కరెక్టని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ప్రజలను నమ్మించి మోసంచేసిన 420 కేసీఆర్ ఇప్పుడు మరో నాటకానికి తెరతీసారని షర్మిల అన్నారు. బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు దాడులు, కేసులతో రాష్ట్రంలో దొందు దొందే అనే సినిమా నడిపిస్తున్నారని వైఎస్ షర్మిల ఎద్దేవా చేసారు. ప్రజాప్రస్ధాన యాత్ర పేరిట వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర నర్సంపేట నియోజకవర్గంలో 3500 కిలోమీటర్లకు చేరింది. ఈ సందర్భంగా షర్మిల పాదయాత్రలో తల్లి వైఎస్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి వైఎస్సార్ నర్సంపేటకు ఏం చేసారో వివరించిన షర్మిల స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విరుచుకుపడ్డారు.