జలపాతం అందాలు చూసేందుకు వెళ్లి... కరీంనగర్ యువకుడు దుర్మరణం
పెద్దపల్లి : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న జలపాతంలో పడి యువకుడు మృతిచెందాడు.
పెద్దపల్లి : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న జలపాతంలో పడి యువకుడు మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా సబ్బితం వాటర్ ఫాల్స్ ను చూసేందుకు కరీంనగర్ నుండి మానుపాటి వెంకటేష్ స్నేహితులతో కలిసి వెళ్ళాడు. అయితే వరదనీటితో ఉదృతంగా ప్రవహిస్తున్న జలపాతానికి చాలా దగ్గరగా వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు వెంకటేష్. ప్రవాహం ఎక్కువగా వుండటంతో నీటిలో కొట్టుకుపోయి మృతిచెందాడు.