
మునుగోడుకు నువ్విచ్చిన హామీలు ఏమయ్యాయి నడ్డా?: చండూరులో వెలిసిన పోప్టర్లు
నల్గొండ : మునుగోడు ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్నకొద్ది ప్రధాన పార్టీల ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది.
నల్గొండ : మునుగోడు ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్నకొద్ది ప్రధాన పార్టీల ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. ఇప్పటికే గ్రామగామాన తిరుగుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్న నాయకులు తమ పార్టీ బలాన్ని పెంచుకోగా ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసి లాభపడాలని అన్ని పార్టీలు చూస్తున్నారు. ఇలా బిజెపిని ఇరుకునపెట్టేందుకు గతంలో కేంద్ర మంత్రి జెపి నడ్డా హామీలను గుర్తుచేస్తూ పోస్టర్లు వెలిసాయి. నల్గొండ జిల్లాలో ప్లోరైడ్ నిర్మూలనకు చౌటుప్పల్ లో ప్లోరైడ్ రీసెర్చ్ సెంటర్, మర్రిగూడలో 300 పడకల ఆస్పత్రి ఏర్పాటుచేస్తామన్న హమీలు ఏమయ్యాయి నడ్డా? అంటూ ప్రశ్నిస్తున్న పోస్టర్లు చండూరులో పోస్టర్లు వెలిసారు.
Add Asianetnews Telugu as a Preferred Source
