కేసీఆర్ పాలనలో రైతే రాజు... వ్యవసాయం దండగ కాదు పండగ : ఎమ్మెల్యే చందర్

పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండగ కాదు పండగలా మారిందని రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.

Share this Video

పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండగ కాదు పండగలా మారిందని రామగుండం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రైతులకోసం టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ మన రైతులను రాజులను చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఇదిచూసి దేశవ్యాప్తంగా వున్న రైతాంగం, ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నార్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ది పనులకు ఎమ్మెల్యే చందర్ శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ప్రత్యేక నిధులతో మార్కెట్ యార్డ్ నిర్మాణం చేపట్టినట్లు... త్వరలోనే ఇది ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video