మునుగోడులో చావుడప్పుతో టీఆర్ఎస్ శవయాత్ర ... బిజెపి దిష్టిబొమ్మ దహనం

నల్గొండ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తెరలేపారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Share this Video

నల్గొండ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలకు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తెరలేపారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కానీ వీరి కుట్రలను భగ్నం చేసి తెలంగాణ ప్రజలకు వారి నిజస్వరూపాన్ని తెలియజేసామని అన్నారు. నరేంద్ర మోడీని ఎదిరించే దమ్మున్న మొనగాడు కేసిఆర్ ఒక్కరేనని... అందుకే ఆయనను బిజెపి టార్గెట్ చేసిందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిఖార్సయిన తెలంగాణ బిడ్డలు... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా వారు అమ్ముడుపోరని అన్నారు. బిడ్డా... కేసీఆర్ అడ్డాలో మీ ఆటలు సాగవు అంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి బిజెపి నేతలను హెచ్చరించారు. హైదరాబాద్ శివారులోని ఫాంహౌస్ కు పిలిచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడానికి బిజెపి ప్రయత్నించిందని మంత్రి ఆరోపించారు. ఇందుకు నిరసనగా మునుగోడులోని చౌటుప్పల్ మండలం నాగారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం, బిజెపి దిష్టిబొమ్మను మంత్రి దహనం చేసారు. టీఆర్ఎస్ శ్రేణులు చావుడప్పుతో బిజెపి దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆ దిష్టిబొమ్మకు నిప్పంటించి దహనం చేసారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video