మాకు డెఫినెట్ గా కవిత ఒడిపోవాలనే ఉంటుంది.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా : స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత గెలిస్తే తమపై ఆధిపత్యం చెలాయిస్తుందనే ఉద్దేశంతో కవిత అనుచరులు ఏడుగురు ఎమ్మెల్యేలు కలిసి కుట్ర పూరితంగా కవితను ఓడించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.
జగిత్యాల జిల్లా : స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత గెలిస్తే తమపై ఆధిపత్యం చెలాయిస్తుందనే ఉద్దేశంతో కవిత అనుచరులు ఏడుగురు ఎమ్మెల్యేలు కలిసి కుట్ర పూరితంగా కవితను ఓడించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. టీఆరెస్ కు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు 30 నుండి 60 వేల మెజారిటీ వచ్చింది... ఆ ఓట్లు ఎటు పోయినాయ్ అని అడిగారు. రైతులతో నామినేషన్ కాంగ్రెస్ పార్టీ వెయిస్తే మరీ బీజేపీలోకి ఎందుకు వెళ్తున్నరాని ప్రశ్నించారు.కవితను నిజామాబాదులో కనబడకుండా చేస్తే తమకు స్వాతంత్రం వస్తుందనే భావనతో కవితను కనబడకుండా చేశారన్నారు. మాకు డెఫినెట్ గా కవిత ఒడిపోవాలని కాంగ్రెస్ గెలవలనే ఉంటుందని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో ఇందిరా గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి జీవన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.