జగిత్యాలలో గ్యాంగ్ వార్ ... నడిరోడ్డుపై కర్రలు, రాళ్లతో ఇరువర్గాల వీరంగం

జగిత్యాల : పాతకక్షల నేపథ్యంలో రెండు వర్గాలు నడిరోడ్డుపై పరస్పర దాడులకు దిగడంతో జగిత్యాలలో తీవ్ర ఉద్రిక్త త చోటుచేసుకుంది. 

Share this Video

జగిత్యాల : పాతకక్షల నేపథ్యంలో రెండు వర్గాలు నడిరోడ్డుపై పరస్పర దాడులకు దిగడంతో జగిత్యాలలో తీవ్ర ఉద్రిక్త త చోటుచేసుకుంది. గాంధీ నగర్ సెంటర్ లో గత రాత్రి కర్రలు, రాళ్లతో రోడ్డుపైకి చేరుకున్న రెండువర్గాలకు చెందిన దాదాపు 50మంది విచక్షణారహితంగా దాడులు చేసుకున్నారు. మహిళలు సైతం ఈ గొడవలో పాల్గొన్నారు. గ్యాంగ్ వార్ గురించి తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు సైతం కొద్దిసేపు పరిస్థితిని కంట్రోల్ చేయడం సాధ్యంకాలేదు. ఎలాగోలా ఇరువర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఇరువర్గాల ఘర్షణ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video