కవిత సిబిఐ విచారణను లైవ్ పెట్టాలి..: సిపిఐ నారాయణ డిమాండ్
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిబిఐ విచారణపై సిపిఐ నాయకులు నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిబిఐ విచారణపై సిపిఐ నాయకులు నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. డిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇవాళ(ఆదివారం) ఆమె ఇంట్లోనే సిబిఐ విచారించనుంది. అయితే ఈ విచారణను లైవ్ పెట్టాలని నారాయణ డిమాండ్ చేసారు.
కేంద్ర ప్రభుత్వం ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్), సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని... అలా కాదని నిరూపించుకోవాలంటే కవితను సిబిఐ ఏం ప్రశ్నిస్తోందో ప్రజలందరికీ తెలియాలన్నారు. న్యాయస్థానాలు సైతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయగా లేనిది సిబిఐ విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయటంలో ఇబ్బంది ఏమిటని నారాయణ ప్రశ్నించారు.