కరీంనగర్ లో ఘోరం... ఎస్పారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ పిల్లల ఆటో

కరీంనగర్: స్కూల్ విద్యార్థులతో వెళుతున్న ఓ ఆటో అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది.

Share this Video

కరీంనగర్: స్కూల్ విద్యార్థులతో వెళుతున్న ఓ ఆటో అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. అయితే ఆటోలోని చిన్నారులు తృటిలో ప్రమాదం నుండి తప్పించుకుని స్వల్ప గాయాలతో సుురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. నిన్నటి(మంగళవారం) నుండి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభంకాగా ఇవాళ కరీంనగర్ లోని ఓ స్కూల్ కి ఏడుగురు విద్యార్థులు ఆటోలో బయలుదేరారు. అయితే ఆటో రేకుర్తి సమీపంలో అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలో పడిపోయింది. అయితే కాలువలో నీరు తక్కువగా వుండటంతో ప్రమాదం తప్పింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్ ను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video