పదేళ్ల తర్వాత తండ్రి ఇంటికొచ్చిన రోజే... యాక్సిడెంట్ లో కొడుకు మృతి

జగిత్యాల: పదేళ్ల తర్వాత భార్యాబిడ్డను చూసేందుకు స్వదేశానికి చేరుకున్న ఆ తండ్రి ఆనందం కొద్దిరోజులు కూడా నిలవలేదు.

Share this Video

జగిత్యాల: పదేళ్ల తర్వాత భార్యాబిడ్డను చూసేందుకు స్వదేశానికి చేరుకున్న ఆ తండ్రి ఆనందం కొద్దిరోజులు కూడా నిలవలేదు. తండ్రి ఇంటికి వచ్చిన రోజే కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హృదయవిధారక ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జగిత్యాల పట్టణంలోని మహాలక్ష్మి నగర్ కు చెందిన మోహన్ భార్య పద్మ, రెండేళ్ల కొడుకు శివక కార్తీక్ ను వదిలి సౌదీకి వెళ్లాడు. కుటుంబానికి దూరమై బాధనడుతూనే దాదాపు పదేళ్లు అక్కడే పనిచేసి ఇటీవలే స్వదేశానికి తిరిగివచ్చాడు.చిన్నపుడు వదిలివెళ్ళిన కొడుకును చూసి భావోద్వేగానికి లోనయన మోహన్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. ఇంతకాలం తండ్రిలేని లోటుతో పెరిగిన కొడుకును ప్రేమగా చూసుకోవాలని భావించాడు. కానీ అతడి ఆశలు కేవలం గంటలోనే ఆవిరయ్యాయి. తాగునీటిని తీసుకురావడంతో బాటిల్ తీసుకుని స్కూటీపై వెళ్లిన కార్తీక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన అతడిని హాస్పిటల్ కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మృతదేహంవద్ద మోహన్ కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్నవారికీ కన్నీరు తెప్పిస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video