వరలక్ష్మీ వ్రతం చేసుకునే సమయాలివే..
సిరులు కురిపించే లక్ష్మీదేవిని కొలిచే వేడుకే వరలక్ష్మీ వ్రతం.
సిరులు కురిపించే లక్ష్మీదేవిని కొలిచే వేడుకే వరలక్ష్మీ వ్రతం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వరలక్ష్మీదేవి. ముత్తైదువలు అత్యంత భక్తి శ్రద్ధలతో.. నియమనిష్టలతో చేసే ఈ వ్రతం శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం సంప్రదాయ బద్ధంగా జరుపుకుంటారు. శుక్రవారం ఉదయం 6.59 నుంచి 9.17 వరకు సింహలగ్నం, ఈ రెండు గంటల 18 నిమిషాలలో పూజ చేసుకోవచ్చని పండితులు తెలియజేశారు. ఈ ముహూర్తం దాటితే మధ్యాహ్నం 1.53 నుంచి 4.11 మధ్య వృశ్చిక లగ్నం ముహూర్తం 2.18 గంటలు, తిరిగి రాత్రి 7.57 నుంచి 9.25 వరకు కుంభలగ్నం 1.28 నిమిషాలు, రాత్రి 12.25 నుంచి 2.21 వరకు వృషభలగ్నం ముహూర్తం 1.56 గంటలు వ్రతాన్ని చేసుకోవాలని సూచిస్తున్నారు.