Asianet News TeluguAsianet News Telugu

video : ఈ దీపావళిని వినూత్నంగా జరుపుకోండి

హిందువులందరూ అత్యంత ఇష్టంగా చేసుకునే పండుగ దీపావళి. మతాబులు, స్వీట్లు, కొత్తబట్టలు అంతటా సందడి వాతావరణం కనిపిస్తుంది. అయితే మారుతున్న భూగోళ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాతావరణానికి హాని కలిగించకుండా ఉండడానికి మనవంతుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎకో ఫ్రెండ్లీ దీపావళి జరుపుకునే కొన్ని మార్గాలు ఇవి.

1. దీపావళి అంటేనే బంధుమిత్రుల కలయిక. పెరిగిపోయే పని. అందుకే డిస్పోజబుల్ వస్తువుల్ని వాడతాం. ఇది అర్థం చేసుకోగలిగిన పరిస్థితే. అయితే వీలైనంత వరకు ఒక్కసారి వాడిపాడేసే ప్లాస్టిక్ వస్తువుల్ని వాడకపోవడం మంచిది. 

2.  దీపావళి అనగానే రంగురంగుల విద్యుద్ధీపాల కాంతితో ఇండ్లు వెలిగిపోతుంటాయి. విద్యుత్ వెలుగులకు బదులుగా దీపాల వెలుగులతో ఇంటిని నింపేయండి. మట్టిప్రమిదల్లో నూనెవేసి వెలిగించే దీపాల వల్ల ప్రకృతికి నష్టం జరగదు. ఆ దీపాల వెలుగులు మన మనసును ప్రశాంతంగా మార్చేస్తాయి.

3. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం దీపావళి పండుగలో ఓ ముఖ్య ఘట్టం. అయితే ఈ బహుమతులను ప్లాస్టిక్ పేపర్లో చుట్టేబదులు జ్యూట్ లేదా క్లాత్ బ్యాగుల్లో పెట్టి ఇవ్వడం మంచిది. వీటిల్లో పెట్టి బట్ట రిబ్బన్ తో అందంగా ముడివేయండి. ఈ జ్యూట్ లేదా బట్ట సంచులను మీరు మళ్లీ మళ్లీ వాడచ్చు. ఇలా చేస్తే మీ వంతుగా ప్లాస్టిక్ వాడకంలో కొంత తగ్గించినవారవుతారు.

4. బహుమతుల ఇచ్చే విషయంలో కొంత వినూత్నంగా ఆలోచించండి. ఎప్పుడూ ఇచ్చేలాగా కాకుండా కాస్త ప్రత్యేకంగా ఉండేలా ఈ సారి బహుమతిగా ఓ మొక్కను ఇవ్వండి. ఈ బహుమతి ఎక్కువకాలం ఉండడమే కాదు, తీసుకున్నవారు మొక్కను చూసినప్పుడల్లా మిమ్మల్ని గుర్తు చేస్తుంది.