diwali celebrations video : తోబుట్టువు నరకంనుండి రక్షించే యమద్వితీయ

హిందూ క్యాలెండర్ విక్రమ్ సంవత్ ప్రకారం శుక్లపక్షం రెండోరోజుగానీ, శాలివాహన శకం క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో కానీ భాయ్ దూజ్ లేదా భాయ్ పొంటా ఉత్సవాన్ని జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో దీన్నే యమద్వితీయగా జరుపుకుంటారు.

First Published Oct 29, 2019, 8:52 PM IST | Last Updated Oct 29, 2019, 8:52 PM IST

హిందూ క్యాలెండర్ విక్రమ్ సంవత్ ప్రకారం శుక్లపక్షం రెండోరోజుగానీ, శాలివాహన శకం క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో కానీ భాయ్ దూజ్ లేదా భాయ్ పొంటా ఉత్సవాన్ని జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో దీన్నే యమద్వితీయగా జరుపుకుంటారు. 

ఈ పండుగ రోజు అక్కలు, చెల్లెలు తమ అన్నాదమ్ములను ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తారు. వారికి ప్రీతిపాత్రమైన తీపిపదార్థాలు చేస్తారు. సోదరులకు హారతి ఇచ్చి, తిలకం దిద్దుతారు. తిలకం దిద్దడం అంటే అన్ని వేళలా తోబుట్టువు రక్షించడమని, దీంతోపాటు ఆడపడుచుల ఆశీర్వాదం ఎల్లవేళలా తన అన్నాదమ్ములకు ఉంటుందనడానికి ప్రతీకగా భావిస్తారు.

పురాణగాథల ప్రకారం యమున దేవత తన అన్న అయిన యమరాజు దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం ఉంటుంది. యముడికి ఇష్టమైన ఆహారపదార్థాలు తయారుచేసి భోజనానికి పిలుస్తుంది. సంతోషపడిన యముడు యమునను ఏదైనా వరం కోరుకోమంటాడు. ఈ రోజు ఏ తోబుట్టువు అయితే తన ఆడపడుచు చేతివంట తింటాడో అతను నరకానికి వెళ్లకుండా వరం అడుగుతుంది. యముడు దీనికి అంగీకరిస్తాడు. అంతేకాదు సోదరుడిని పిలిచి భోజనం పెట్టిన ఆడపడుచు ఎప్పటికీ విధవ కాకుండా వరం ఇస్తాడు.

ఇంకో పురాణగాథ ప్రకారం నరకాసుర వధ అనంతరం శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర ఇంటికి వస్తాడు. అన్నకు ఘనస్వాగతం పలికిన సుభద్ర..అన్నకు పూలు, పండ్లు ఇచ్చి సంబురంగా వేడుక చేస్తుంది. అంతేకాదు కృష్ణుడి నుదుటిమీద తిలకం దిద్దుతుంది. 

అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్లందరూ ఈ రోజును ఘనంగా జరుపుకోవాలని కోరుకుందాం.