Asianet News TeluguAsianet News Telugu

భవిష్యత్తులో గాలి కొనుక్కునే రోజులొస్తాయి.. హరితహారంలో కేటీఆర్..

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. వెదురుగట్ట గ్రామంలోని 200 ఎకరాల్లో 69 వేల మొక్కలు నాటే హరితహార కార్యక్రమం నిర్వహించడం సంతోషకరం అన్నారు. 

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. వెదురుగట్ట గ్రామంలోని 200 ఎకరాల్లో 69 వేల మొక్కలు నాటే హరితహార కార్యక్రమం నిర్వహించడం సంతోషకరం అన్నారు.  నీళ్లు కొనుక్కునే తాగే రోజులొస్తాయని ఆనాడు బ్రహ్మంగారు చెప్పిన మాటలు నిజమవుతాయని ఎవరూ అనుకోలేదు. చెట్లు సంరక్షించకపోతే భవిష్యత్తులో గాలి కూడా కొనుక్కునే రోజులు వస్తాయన్నారు. మొక్కలు నాటకపోతే భవిష్యత్తులో తీవ్ర విపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణలోని ఫారెస్టు కవరేజ్ ఏరియాను 33 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో హరితహారం సాగుతోందన్నారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కరోనావల్ల ప్రపంచమంతా ఆందోళనతో ఉన్నా.. మనం దానితో సహజీవనం సాగిస్తూనే మిగతా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం అని అన్నారు.