
తిరుమల శ్రీవారి సేవలో తండేల్ టీం
హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా హిట్ టాక్ అందుకుంది. దీంతో మూవీ టీం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సినిమా హిట్ కావడంతో స్వామి వారికి మొక్కులు చెల్లించకున్నట్లు డైరెక్టర్ చందు మొండేటి తెలిపారు.