ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా.. హీరోయిన్ దివ్యభారతి క్యూట్ స్పీచ్ | కింగ్‌స్టన్ | Asianet Telugu
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా, దివ్య భారతి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం కింగ్‌స్టన్. హీరో, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరించారు. ఈ సినిమాకి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఈ నెల 7న థియేటర్లలో ఈ మూవీ విడుదల కానుండగా... హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నితిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ దివ్య భారతి తెలుగులో క్యూట్ గా మాట్లాడారు.