పవన్ కళ్యాణ్.. అధికారం వచ్చాక మారిపోయారు ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఏపీ కాంగ్రెస్ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. 

Share this Video

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఏపీ కాంగ్రెస్ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ వేషం, భాషా రెండు మారాయన్నారు. సెక్యూలర్ పార్టీగా ఉన్న జనసేన కాస్త రైటిస్ట్ పార్టీగా మారిందా..? అని ప్రశ్నించారు. బాధ్యత కలిగిన పదవిలో ఉండి, ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకుని, ఆ మతమే ముఖ్యమని మాట్లాడుతుంటే... ఇతర మతాలకు అభద్రతాభావం ఉండదా..? అని నిలదీశారు. మతం అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం RSS సిద్ధాంతమైతే.. అదే సిద్ధాంతానికి పవన్ కళ్యాణ్ డబుల్ ఏజెంట్ అయ్యాడని విమర్శించారు. ప్రధాని మోడీ దర్శకత్వంలో యాక్టింగ్ చేసే పవన్‌కు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతికత లేదన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video