
వైసీపీవాళ్లకి పథకాలు ఎగ్గొట్టడానికి నీ బాబు సొమ్మా?: YS Jagan Fire On Chandrababu
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకి పనులు చేయొద్దంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. వైసీపీ వాళ్లకి పథకాలు ఇవ్వకపోవడానికి ఎవరి బాబు సొమ్ము అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్... ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగడానికి చంద్రబాబు అనర్హుడని చెప్పారు. తమ ప్రభుత్వంలో 66.34లక్షల పింఛన్లు ఇచ్చామని.. చంద్రబాబు పాలనలో వాటిలోనూ కోత విధించారని ఆరోపించారు.