విజయవాడలో భారీ మోసం... సామాన్యులకు రూ.4కోట్లు టోకరా
విజయవాడ: కూతురు పెళ్లి కోసం, పిల్లల చదువుల కోసం, చివరి రోజుల్లో అవసరపడతాయని దాచుకున్న రిటైర్మెంట్ డబ్బులు...
విజయవాడ: కూతురు పెళ్లి కోసం, పిల్లల చదువుల కోసం, చివరి రోజుల్లో అవసరపడతాయని దాచుకున్న రిటైర్మెంట్ డబ్బులు... ఇలా మద్యతరగతి కుటుంబాలు రూపాయి రూపాయి కూడబెట్టి చిట్టీలు కడితే ఒకేసారి వారందరిని దోచేసి పరారయ్యాడు ఓ ప్రబుద్దుడు. ఈ ఘటన విజయవాడలోని శ్రీనగర్ కాలనీలో చోటుచేసుకుంది.
ఈ కాలనీలో కొన్నేళ్లుగా నివాసముంటున్న బాలాజీ అనే వ్యక్తి చిట్టీల వ్యాపారం చేసేవాడు. అతడిపై నమ్మకంతో చాలామంది అతడి వద్ద చిట్టీలు కడుతున్నారు. అయితే లాక్ డౌన్ సమయంలో ఆర్థిక సమస్యలున్నాయంటూ చిట్టీ డబ్బులు ఇవ్వకుండా బాధితులను ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఏకంగా రూ.4కోట్లు టోకరా వేసి పరారయ్యాడు. దీంతో అతడి చేతిలో మోసపోయిన బాధితులు లబోదిబోమంటున్నారు. చిట్టీలు కట్టి మోసపోయిన బాదితులు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు.