వైసీపీ వాళ్ల గురించి మాట్లాడటమే వేస్ట్: Vemireddy Prashanthi Reddy Slams YSRCP | Asianet Telugu

Share this Video

దోచుకోవడం, దాచోవడమే టార్గెట్ గా పెట్టుకొని స్వలాభం తప్ప సామాన్యుల కోసం పని చేయని వైసీపీ నాయకుల గురించి మాట్లాడటం వృథా అని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. అస్థిత్వం చాటుకోవడానికే మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు కపట నాటకాలాడుతున్నాడని ఫైర్ అయ్యారు. కోవూరులో పాత్రికేయులు అడిగిన ఒక ప్రసన్నకు ఆమె సమాధానం చెబుతూ సొంత పార్టీ నాయకులను నియంత్రించుకోలేక టిడిపి నేతలను ఆడిపోసుకుంటున్న ప్రసన్న తీరు అతని అసమర్ధతకు అద్దం పడుతుందన్నారు. పనీ పాట లేని మాజీలు పబ్లిసిటీ కోసం ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రినని చెప్పుకునే ప్రసన్న వైసిపి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారా..? లేక టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

Read More

Related Video