మాచర్లలో టెన్త్ విద్యార్థిని మిస్సింగ్ ... హాస్టల్ వార్డెనే ఇంతపని చేసాడా?

పల్నాడు జిల్లా మాచర్లలో పదో తరగతి విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపుతోంది.  

Share this Video

పల్నాడు జిల్లా మాచర్లలో పదో తరగతి విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపుతోంది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న బాలిక హాస్టల్లో వుండేది. అయితే దసరా సెలవుల సందర్భంగా ఇంటికి వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. ఆమె ఆఛూకీ కోసం వెతికిన తల్లిదండ్రులు ఎక్కడా జాడలేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇలా బాలిక మిస్సింగ్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో హాస్టల్ వార్డెన్ గా పనిచేసిన శ్రీనివాసరావుపై బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడే తమ పాపను కిడ్నాప్ చేసివుంటాడని అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు వార్డెన్ విషయం బయటకు రాకుండా చూస్తున్నారు. మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు బాలిక కోసం గాలిస్తున్నారు. బాలిక మిస్సింగ్ తో తమకు ఎలాంటి సబంధం లేదని స్కూల్ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video