Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో స్టార్ ఆంధ్ర ప్రదేశ్ అందాల పోటీలు... ర్యాంప్ వాక్ తో కట్టిపడేసిన ముద్దుగుమ్మలు

విశాఖపట్నం : స్టార్ ఆంధ్ర ప్రదేశ్ పేరిట బీచ్ సిటీ విశాఖపట్నంలో అందాల పోటీలు నిర్వహించారు. 

First Published Dec 22, 2022, 1:05 PM IST | Last Updated Dec 22, 2022, 1:05 PM IST

విశాఖపట్నం : స్టార్ ఆంధ్ర ప్రదేశ్ పేరిట బీచ్ సిటీ విశాఖపట్నంలో అందాల పోటీలు నిర్వహించారు. ఈ బ్యూటీ కాంటెస్ట్ లో రాష్ట్రవ్యాప్తంగా 1500 మందికి పైగా యువతీయువకులు పాల్గొనగా కేవలం పదిమంది అందమైన ముద్దుగుమ్మలు, యువకులు మాత్రమే ఫైనల్ కు చేరుకున్నారని నిర్వహకులు తెలిపారు. వీరితో విశాఖలోని ఓ హోటల్లో చేపట్టిన కార్యక్రమంలో సాంప్రదాయ, ఫ్యాషన్ దుస్తుల్లో అమ్మాయిలు చేసిన ర్యాంప్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. విశాఖలోని వివిధ ఫ్యాషన్ కాలేజీల అమ్మాయిలు కూడా ఈ అందాల పోటీలో పాల్గొని అలరించారు...  ప్రొఫెషనల్ మోడళ్లకు ఏమాత్రం తీసిపోనట్టుగా ర్యాంప్ వాక్ చేసారు.  క్లాసిక్ ఎంటర్టైన్ మెంట్ ఆధ్వర్యంలో ఈ అందాల పోటీలు జరిగాయి.