
పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అంటే తెలంగాణకు నీళ్లే కావాలని చెప్తా: Revanth
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజెన్ మెడికేర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై స్పందించారు. రాజకీయ లాభాల కోసం తమ ప్రభుత్వం జల సమస్యను వాడుకోవడం లేదని స్పష్టం చేస్తూ, తెలంగాణకు వివాదాలు కాదు నీళ్లే కావాలని స్పష్టం చేశారు. మన సమస్యలను మనమే సామరస్యంగా పరిష్కరించుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ వేదికగా విజ్ఞప్తి చేశారు.