ప్రకాశం జిల్లాలో దారుణం ... అతివేగం ఎంత ఘోరం స‌‌ృష్టించిందో చూడండి...

ఒంగోలు : అతివేగం ప్రమాదకరమని ఎంత హెచ్చరించినా, ఎంత ప్రచారం చేసినా వాహనదారుల తీరు మారడంలేదు.

Share this Video

ఒంగోలు : అతివేగం ప్రమాదకరమని ఎంత హెచ్చరించినా, ఎంత ప్రచారం చేసినా వాహనదారుల తీరు మారడంలేదు. రోడ్డుపై రయ్ రయ్ మంటూ వేగంగా వెళ్ళడం ప్యాషన్ గా మారింది. ఇలా కొందరు వాహనదారులు అతివేగంగా వెళుతూ తమ ప్రాణాలనే కాదు ఇతరుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో ఇలాగే ఓ బైకర్ అతివేగానికి ఓ ప్రాణం బలవగా మరో 
ఇద్దరిని హాస్పిటల్ పాలు చేసింది. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వాహనదారుడు వేగంగా వెళుతూ ఓ బొలెరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయాడు. వేగంగా వెళుతూ డివైడర్ ను ఢీ కొట్టడం బైక్ పై వున్న ఇద్దరు రోడ్డుపై పడ్డారు. అయితే బైక్ జారుకుంటూ కొద్ది ముందుకెళ్లి మరో ద్వచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video