ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలు... నివాళులర్పించిన సీఎం జగన్

విజయవాడ: విధినిర్వహణలో ప్రాణాలకు తెగించి పోరాడిన పోలీస్ అమరవీరులను స్మరించుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

Share this Video

విజయవాడ: విధినిర్వహణలో ప్రాణాలకు తెగించి పోరాడిన పోలీస్ అమరవీరులను స్మరించుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ కు చెందిన 11 మంది పోలీసులు అమరులవగా వారి కుటుంబాలకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం "అమరులు వారు" అనే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ... ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక హోంశాఖలో సిబ్బంది కొరత తగ్గించి పోలీసులపై పనిఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని... ఇందులో భాగంగానే 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి సిద్దమైనట్లు తెలిపారు. పోలీస్ ఉద్యోగాల్లోహోంగార్డ్ లకి రిజర్వేషన్ కల్పించనున్నట్లు తెలిపారు. ఇక ఇప్పటికే 16 వేల మంది మహిళా పోలీసులను నియమించినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video