వైసిపి ర్యాలీలో 'సీఎం పవర్ స్టార్' నినాదాలు ... అధికార పార్టీకి చేదు అనుభవం

విశాఖపట్నం : అనకాపల్లి జిల్లా చోడవరంలో అధికార వైసిపికి వింత అనుభవం ఎదురయ్యింది.

Share this Video

 విశాఖపట్నం : అనకాపల్లి జిల్లా చోడవరంలో అధికార వైసిపికి వింత అనుభవం ఎదురయ్యింది. జగన్ సర్కార్ వికేంద్రీకరణ కోసమంటూ మూడు ప్రాంతాల్లో రాజధానిని ఏర్పాటుచేస్తామంటూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ చోడవరంలో వైసిపి భారీ కార్యక్రమం నిర్వహించింది. స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేతృత్వంలో విద్యార్థులతో వైసిపి ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు వైసిపికి కాకుండా జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కు మద్దతుగా నినాదాలతో హోరెత్తించారు. విద్యార్థులు ముక్తకంఠంతో 'సీఎం పవర్ స్టార్' అంటూ నినాదాలు చేయడంతో అవాక్కవడం వైసిపి నాయకుల వంతయ్యింది. 

Related Video