అలాంటోళ్లని వందమందిని తయారుచేయాలి.. లేదంటే చిల్లరగాళ్లు మళ్లీ వస్తారు: పవన్ కళ్యాణ్ | Asianet Telugu
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన జయకేతనం పేరిట భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరై.. ప్రసంగించారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. యువత నుంచి బలమైన నాయకుల్ని తయారు చేయాలన్నారు. లేదంటే గత ప్రభుత్వంలో మాదిరి చిల్లర వేషగాళ్ళు మళ్ళీ వస్తారని హెచ్చరించారు.