
Minister Gummidi Sandhyarani:నా కొడుకు జోలికొస్తే ఊరుకోను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే తన కుమారుడి జోలికి వస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాక్షసానందం తప్ప మరొకటి కాదన్నారు. ఓ పత్రిక కావాలనే తనను టార్గెట్ చేస్తూ తప్పుడు రాతలు రాస్తోందని తీవ్రంగా విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటా అని.. తన కుమారుడి జోలుకి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదనీ స్పష్టం చేశారు. మార్ఫింగ్ వీడియోలతో మమ్మల్ని బెదిరించాలని చూస్తున్నారా? అని మండిపడ్డారు.