నాపై సస్సెన్షన్ సరే... ఎందుకో కూడా చెప్పండి..?: వైసిపిని నిలదీసిన మాజీ మంత్రి సుబ్బారాయుడు

నరసాపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు స్పందించారు. తాను పార్టీకి ఏ ద్రోహం చేసానో... 

Share this Video

నరసాపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు స్పందించారు. తాను పార్టీకి ఏ ద్రోహం చేసానో... ఎక్కడ తప్పుచేసానో చెప్పాలంటూ ఎమ్మెల్యే ప్రసాదరాజును మాజీ మంత్రి నిలదీసారు. మీకు ఎవరు ఫిర్యాదు చేసారు... ఆ పిర్యాదులో ఏమని రాసిచ్చారు? అంటూ వైసిపి క్రమశిక్షణ సంఘాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. తనను సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు... కానీ ఎందుకు సస్పెండ్ చేస్తున్నది చెప్పలేదు ఎందుకు అని నిలదీసారు. కోర్టులో శిక్ష విధించేపుడు తప్పేమిటో చెబుతారు... కానీ మీరు అలా ఎందుకు చేయలేదని అడిగారు. పార్టీ నియమావళి ప్రకారం క్రమశిక్షణా సంఘం నడుచుకోవాలని... అలా కాకుండా తనపై ఫిర్యాదు కరెక్టో కాదో తేల్చుకోకుండా,,, షోకాజ్ నోటీసులిచ్చి వివరణ కోరకుండానే సస్పెండ్ చేయడం ఏమిటని అడిగారు. తాను వైసిపి పార్టీకి సాయం చేసానే తప్ప ఏరోజూ ద్రోహం చేయలేదని సుబ్బారాయుడు అన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video