
చంద్రబాబుని ఇమిటేట్ చేసిన జగన్
వైసీపీ పాలనే మేలు అని ప్రజలు అనుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు సంక్షేమం అని పలకడం కూడా రాదని ఎద్దేవా చేశారు. జగన్ కంటే మెరుగైనా సంక్షేమం అందిస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.