
జగన్ రాప్తాడు పర్యటనపై హోం మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు
శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా 1100మంది పోలీసులతో భద్రత కల్పించినట్లు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై నెపం నెట్టేందుకు అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ పర్యటనలో గొడవలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారం అందడంలో పోలీసు భద్రత పెంచామని.. అయినా, డబ్బులిచ్చి మరీ జనాన్ని రప్పించారన్నారు. కొందరు వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో పోలీసులు గాయపడ్డారని తెలిపారు.