విజయవాడ శ్రీచైతన్య కాలేజీలో అగ్నిప్రమాదం... విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం
విజయవాడ బందరు రోడ్డులోని శ్రీ చైతన్య కాలేజీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడ బందరు రోడ్డులోని శ్రీ చైతన్య కాలేజీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలను గుర్తించిన కాలేజీ యాజమాన్యం వెంటనే అప్రమత్తమై పైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారమిచ్చారు. అంతకుముందే కాలేజీలోని విద్యార్థులను సురక్షితంగా బయటకు పంపించారు. షార్ట్ సర్య్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది కాలేజీలో చెలరేగిన మంటలను అదుపు చేస్తున్నారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.