Asianet News TeluguAsianet News Telugu

అభిమానం ముందు ఈ నొప్పెంత..! పవన్ కల్యాణ్ పాటవింటూ గాయానికి కుట్లేసినా బాధే లేదట

ప్రకాశం : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల గురించి అందరికీ తెలిసిందే.

ప్రకాశం : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల గురించి అందరికీ తెలిసిందే. ఆయనపై నరనరాన అభిమానాన్ని నింపుకున్న అభిమానులను తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని చూస్తాం... కానీ ఇతర రాష్ట్రాల్లోనూ ఆయనంటే పడిచచ్చే అభిమానులున్నారని తాజాగా ఓ ఘటనద్వారా బయటపడింది. ఒరిస్సాకు చెందిన ఓ వ్యక్తి  తల పగిలి రక్తస్రావంతో హాస్పటల్లో చేరి పవన్ కల్యాణ్ పాటవింటూ కుట్లు వేయించుకున్నాడు. వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని ఓ ప్రైవేట్ కంపనీలో ఒరిస్సాకు చెందిన కిషోర్ చౌదరి పనిచేస్తున్నారు. అయితే అతడు ప్రమాదవశాత్తు కిందపడిపోగా తలకు తీవ్ర గాయంతో ఓ హాస్పిటల్ కు వెళ్లాడు. గాయానికి కుట్లు వేయాలని భావించిన డాక్టర్లు అనస్తీషియా ఇచ్చినా అతడిపై అంతగా పనిచేయలేదు. నొప్పితో విలవిల్లాడిపోతున్న అతడు పవన్ కల్యాణ్ పాటలు పెట్టాలని కోరాడు. దీంతో డాక్టర్లు పవన్ సినిమాలోని సాంగ్ పెట్టగా కిషోర్ వాటిలో లీనమైపోయాడు. ఈ సమయంలో డాక్టర్లు కుట్లు వేసినా అతడి ముఖంలో ఎలాంటి బాధ కనిపించకపోవడంతో డాక్టర్లు అవాక్కయ్యారు.