
Deputy CM Pawan Kalyan: కాకినాడ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం
కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో సమావేశమై జిల్లా శాంతి భద్రతల పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన భద్రత, చట్ట పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.