విశాఖ వాసులకు అద్భుత అవకాశం... సముద్రంలో సరదా విహారానికి సర్వం సిద్దం

విశాఖపట్నం: సముద్రపు అలలపై తేలియాడుతూ కుటుంబసభ్యులతో సరదాగా గడిపే అద్భుత అవకాశం విశాఖవాసులకు దక్కనుంది. 

Share this Video

విశాఖపట్నం: సముద్రపు అలలపై తేలియాడుతూ కుటుంబసభ్యులతో సరదాగా గడిపే అద్భుత అవకాశం విశాఖవాసులకు దక్కనుంది. సాగర జలాల్లో మూడు రోజులు కుటుంబంతో విహరించేందుకు సకల సౌకర్యాలతో కూడిన భారీ క్రూయిజ్ షిప్ ఎంప్రెస్ విశాఖకు చేరుకుంది. ఈ నౌక ఇవాళ వైజాగ్‌ నుంచి బయలుదేరి పుదుచ్చేరి, చెన్నై మీదుగా మూడురోజులు ప్రయాణించి తిరిగి వైజాగ్‌ చేరుకుంటుంది. ఈ క్రూయిజ్ షిప్ విశాఖకు చేరుకున్న సందర్భంగా బ్యాండ్ మేళాలతో ప్రయాణికులకు ఘన స్వాగతం పలికారు. ప్రయాణికులు ఆనందంగా నృత్యాలు చేస్తూ సముద్రయానానికి బయలుదేరారు. 796 క్యాబిన్లు, 313 ఇన్‌సైడ్‌ స్టేట్‌ రూమ్స్, 414 ఓషన్‌ వ్యూ రూమ్స్, 63 బాల్కనీ రూమ్స్, 5 సూట్‌ రూమ్‌లతో పాటు ఒక లగ్జరీ సూట్‌ రూమ్‌, ఫుడ్‌ కోర్టులు, 3 స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్‌ క్లబ్, స్విమ్మింగ్‌ పూల్స్, ఫిట్‌నెస్‌ సెంటర్లు, డీజే ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్‌ బ్యాండ్, అడ్వెంచర్‌ యాక్టివిటీస్, షాపింగ్‌ మాల్స్, లైవ్‌షోలు ఇలా సకల సౌకర్యాలతో కూడిన క్రూయిజ్ లో ఎంజాయ్ చేయడానికి ప్రయాణికులు సిద్దమయ్యారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video