కృష్ణంరాజు ఆలోచనలను బిజెపి ముందుకు తీసుకెళతాం..: బిజెపి విష్ణువర్ధన్ రెడ్డి
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు దక్షిణాది లో రెబల్ స్టార్ గా, బిజెపి కేంద్ర మంత్రిగా కృష్ణం రాజు అకాల మరణం బాధాకరమని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు దక్షిణాది లో రెబల్ స్టార్ గా, బిజెపి కేంద్ర మంత్రిగా కృష్ణం రాజు అకాల మరణం బాధాకరమని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. రాజకీయాల్లోనూ కృష్ణంరాజు తనవంతు పాత్ర పోషించారని... ఎంపీగా, కేంద్రమంత్రిగా ఆయన సేవలు మరిచిపోలేనివని అన్నారు. జాతీయవాద ఆలోచనలు కలిగిన కృష్ణంరాజు స్వాతంత్ర సమరయోదులు అల్లూరి సీతారామరాజు లాంటి ప్రముఖులు జీవితాన్ని ఇతివృత్తంగా సినిమా తీసి యువతలో జాతీయబావం నింపారన్నారు. ఇలాంటి ఆయన ఆలోచనలు, సేవలను బిజెపి ముందుకు తీసుకువెళుతుందన్నారు. కృష్ణంరాజు మరణంపై ఏపీ బిజెపి నాయకత్వం బాదాతప్త హృదయాలతో సంతాపం తెలుపుతోందని విష్ణువర్ధన్ పేర్కొన్నారు.