Asianet News TeluguAsianet News Telugu

తాడిపత్రి సీఐ ఆత్మహత్యకు కారణమదే..: ఎస్పీ శ్రీనివాసరావు

అనంతపురం : తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య పోలీస్ శాఖలో కలకలం రేపిన నేపథ్యంలో అనంతపురం ఎస్పీ శ్రీనివాసరావు కీలక ప్రకటన చేసారు. 

అనంతపురం : తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య పోలీస్ శాఖలో కలకలం రేపిన నేపథ్యంలో అనంతపురం ఎస్పీ శ్రీనివాసరావు కీలక ప్రకటన చేసారు. పని ఒత్తిడివల్లే తన తండ్రి సూసైడ్ చేసుకున్నాడని సీఐ కూతురు అంటుంటే... పోలీస్ శాఖకు ఈ ఆత్మహత్యతో ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ అంటున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులే సీఐ ఆత్మహత్యకు కారణమని ఎస్పీ తెలిపారు. భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంటి నిర్మాణం కోసం బ్యాంకులో తీసుకున్న లోన్ ఈఎంఐ  తో సీఐ సతమతం అయ్యాడని... అందువల్లే సూసైడ్ చేసుకున్నాడని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రాత్రి కూడా ఆనందరావుకు భార్యతో గొడవ జరిగిందని... ఆ తర్వాతే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తమ విచారణలో తేలినట్లు ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. 

Video Top Stories