పవన్.. వాపుని చూసి బలుపు అనుకుంటున్నావు: అంబటి రాంబాబు | YSRCP | Asianet News Telugu
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు సామాజికవర్గం చంద్రబాబును విశ్వసించడం లేదని, అందుకే పవన్‌తో పార్టీ పెట్టించారన్నారు. టీడీపీ, జనసేన రెండింటి మద్దతుతో 21 సీట్లు గెలుచుకున్నారంటూ జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు.