రష్యాలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా... భారీగా డబ్బులు వసూలుచేసి మోసం
విశాఖపట్నం: రష్యాలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుండి లక్షలు వసూలు చేసి మోసం చేసింది ఓ సంస్థ. విశాఖపట్నం గాజువాకలోని ఆటోనగర్ లో కామాక్షి ఎంటర్ ప్రైజేస్ తమిళనాడుకు చెందిన పదిమంది నిరుద్యోగులకు రష్యాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించింది. నిర్వహకుల మాటల నమ్మిన నిరుద్యోగులు మూడు నెలల క్రితమే లక్షల్లో డబ్బులు ఇచ్చారు. అయితే డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా రష్యాకు పంపించకపోవడంతో అనుమానం వచ్చిన నిరుద్యోగులు కామాక్షి ఎంటర్ ప్రైజెస్ నిర్వహకులను నిలదీసారు. తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అని అడిగినందుకు ఇద్దరు నిరుద్యోగులను నిర్వహకులు చితకబాదారు. అంతేకాదు ఎలాంటి అధారాలు లేకుండా చేసేందుకు నిరుద్యోగుల మొబ్తెల్స్ ను ద్వంసం చేసారు. దీంతో మోసపోయిన నిరుద్యోగులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు.