Asianet News TeluguAsianet News Telugu

Top 10 Sports News: టీ20 జ‌ట్టులోకి కోహ్లీ, రోహిత్.. డేవిడ్ వార్న‌ర్ కొత్త అవ‌తారం.. నాద‌ల్ ఔట్

Sports Top 10 News: టీమిండియా టీ20 జ‌ట్టులోకి భార‌త స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు తిరిగి వ‌చ్చారు. భార‌త మ‌హిళా జ‌ట్టుకు షాక్.. ఎంపీగా గెలిచిన ష‌కీబ్ అల్ హస‌న్, ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నాద‌ల్ ఔట్.. ఇలాంటి టాప్-10 స్పోర్ట్స్ న్యూస్ ఇవిగో..  
 

Top 10 Sports News: Cricket Hockey Volleyball Football Tennis IPL, Virat Kohli, Rohit Sharma Rafael Nadal RMA
Author
First Published Jan 8, 2024, 10:10 AM IST

Top 10 Sports News:

భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్: జ‌ట్టులోకి రోహిత్, కోహ్లీ

భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ కోసం బీసీసీఐ టీమిండియా జ‌ట్టును ప్ర‌క‌టించింది. భార‌త స్టార్ ప్లేయ‌ర్స్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు జ‌ట్టులోకి తిరిగి వ‌చ్చారు. దాదాపు ఏడాది కాలం తర్వాత ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు భార‌త్ త‌ర‌ఫున టీ20 మ్యాచ్ లు ఆడ‌బోతున్నారు.

భార‌త జ‌ట్టుకు ఆసీస్ షాక్.. 

ఆసీస్ తో జ‌రుగుతున్న టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా రెండో మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో జనవరి 9న జరగనున్న మూడో మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది.

అందుకే రాజ‌కీయాల‌కు దూరం.. 

భార‌త మాజీ స్టార్ క్రికెట‌ర్, చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లేయ‌ర్ అంబ‌టి రాయుడు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని  రోజుల‌కే పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పాడు. అధికార పార్టీ వైకాప నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై క్లారిటీ ఇచ్చిన అంబ‌టి రాయుడు.. క్రికెట్ కోస‌మే రాజ‌కీయాల‌కు దూర‌మ‌వుతున్న‌ట్టు చెప్పాడు. దుబాయ్ లో జ‌రిగే ఐఎల్ టీ20 లీగ్ లో ముంబై ఫ్రాంఛైజీకి అడుతున్న‌ట్టు తెలిపాడు.

Shweta Sehrawat: టీమిండియా క్రికెటర్ సంచ‌ల‌న ఇన్నింగ్స్.. 150 బంతుల్లో 242 ప‌రుగులు

ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నాద‌ల్ ఔట్.. 

టెన్నిస్ దిగ్గ‌జం ర‌ఫెల్ నాద‌ల్ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి  వైదొలిగాడు. బ్రిస్బేన్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్వార్ట‌ర్ ఫైన‌ల్ స‌మ‌యంలో కండ‌రాల గాయ‌మైంద‌నీ, చికిత్స చేయించుకుని కోలుకునేందుకు విశ్రాంతి తీసుకుంటున్న‌ట్టు పేర్కొన్నాడు.

కోచ్ అవ‌తారంలో డేవిడ్ వార్న‌ర్.. 

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ డేవిడ్ వార్న‌ర్ ఇటీవ‌లే టెస్టు, వ‌న్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే, టీ20, ఇత‌ర లీగ్ మ్యాచ్ ల‌లో ఆడ‌నున్నాడు. అయితే, తాను కోచ్ అవ‌తారం ఎత్త‌బోతున్న‌ట్టు చెప్పాడు. క్రికెట్ నుంచి పూర్తిగా త‌ప్పుకున్న త‌ర్వాత కోచ్ గా బాధ్య‌త‌లు చేప‌డ‌తాన‌ని చెప్పాడు.

క్రికెట్ లో స్టార్.. పాలిటిక్స్ ఎంట్రీతోనే ఎంపీ.. 

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ ఆ దేశ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచారు. మ‌గురా స్థానం నుంచి పోటీ చేసిన ష‌కీబ్.. 1.50 ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అవామీ లీగ్ పార్టీ త‌ర‌ఫున ఆయ‌న బ‌రిలోకి దిగారు.

ఐపీఎల్ కు సూర్యకుమార్ దూరం.. ! 

ముంబై ఇండియ‌న్స్ కు బిగ్ షాక్ తగిలేలా ఉంది. ఆ జ‌ట్టు స్టార్ ప్లేయ‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో అత‌ను రాబోయే ఐపీఎల్ కొన్ని మ్యాచ్ ల‌కు దూరం కానున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. గాయం కార‌ణంగా ప్ర‌స్తుతం భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ సిరీస్ కు దూర‌మ‌య్యాడు. 

MS Dhoni: హుక్కా పీలుస్తూ.. ధోనీ వీడియో వైర‌ల్.. కెప్టెన్ కూల్ పై విమ‌ర్శ‌లు

జూనియ‌ర్ హాకీ ఇండియా కోర్ ప్రాబబుల్ గ్రూప్ ప్ర‌క‌ట‌న‌

బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో సోమవారం నుంచి ప్రారంభమయ్యే జూనియర్ ఉమెన్స్ నేషనల్ కోచింగ్ క్యాంప్ కోసం హాకీ ఇండియా (హెచ్‌ఐ) 41 మంది సభ్యుల కోర్ ప్రాబబుల్ గ్రూప్‌ను ప్రకటించింది. 2023లో జరగనున్న దేశీయ ఛాంపియన్‌షిప్‌లో వారి ప్రదర్శన ఆధారంగా కొత్త కోర్ ప్రాబబుల్ గ్రూప్ ఎంపిక చేసింది. 

టెస్టులు, వన్డేల భవిష్యత్తుపై ఏబీ డివిలియర్స్ ఆందోళన.. 

సౌతాఫ్రికా టీ20ల‌ను ఉదహరిస్తూ న్యూజిలాండ్‌తో జరిగిన ప్రోటీస్ జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఎవరూ లేరని ప్రతిస్పందిస్తూ.. టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై టీ20 క్రికెట్ ప్రభావం గురించి ఏబీ డివిలియర్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. టీ20లు క్రికెట్ వ‌న్డే, టెస్టు ఫార్మాట్‌లపై ఒత్తిడి తెస్తున్నాయని పేర్కొన్నాడు.

బాల్ ట్యాంపరింగ్.. పాక్ బౌల‌ర్ల‌పై ప్రవీణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు 

టీంఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ లల్లాంటాప్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరూ బంతిని కొద్దిగా టాంపరింగ్ చేసేవారనీ, పాక్ బౌలర్లు చాలా చేసేవారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, 'ఇప్పుడు చాలా కెమెరాలు ఉన్నాయి. గతంలో బౌలర్లు బంతిని ఒక వైపు నుంచి స్క్రాచ్ చేసేవారని' పేర్కొన్నాడు.

వింటేజ్ రైడ్ లో ర‌వీంద్ర జ‌డేజా.. ఎద్దుల బండి నడుపుతున్న వీడియో వైరల్.. !

Follow Us:
Download App:
  • android
  • ios