జమిలి ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర స్పందించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మంచి ప్రతిపాదన అని, అయితే, అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని వివరించారు. దీనిపై పార్లమెంటులో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, తాము అన్ని ఎన్నికలు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.