Taliban: ఆఫ్ఘనిస్తాన్ లో మహిళా హక్కులు అణచివేయబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్.. అక్కడ మానవ హక్కులను కాపాడాలంటూ ప్రపంచ దేశాల నాయకులను కోరారు. తకుముందు, ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఆఫ్ఘన్ మహిళలు తల నుండి కాలి వరకు మొత్తం శరీరాన్ని కప్పివుంచేలా దుస్తులు ధరించాలంటూ తాలిబాన్లు జారీ చేసిన ఆదేశాలపై ఆందోళన వ్యక్తం చేశారు.