Asianet News TeluguAsianet News Telugu

Malala Yousafzai: ఆఫ్ఘ‌న్ లో మ‌హిళా హ‌క్కుల అణ‌చివేత‌.. చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ప్ర‌పంచ‌దేశాల‌కు మ‌లాలా పిలుపు

Taliban: ఆఫ్ఘనిస్తాన్ లో మ‌హిళా హ‌క్కులు అణ‌చివేయ‌బ‌డుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసిన నోబెల్ బహుమ‌తి గ్ర‌హీత మ‌లాలా యూస‌ఫ్‌జాయ్‌.. అక్క‌డ‌ మాన‌వ హ‌క్కుల‌ను కాపాడాలంటూ ప్ర‌పంచ దేశాల నాయ‌కుల‌ను కోరారు. తకుముందు, ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఆఫ్ఘన్ మహిళలు తల నుండి కాలి వరకు మొత్తం శ‌రీరాన్ని క‌ప్పివుంచేలా దుస్తులు ధ‌రించాలంటూ తాలిబాన్లు జారీ చేసిన ఆదేశాల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 
 

Malala slams Taliban for hijab decree, urges world leaders to take action
Author
Hyderabad, First Published May 10, 2022, 10:12 AM IST

hijab: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబ‌న్ల దుశ్చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా మ‌హిళా హ‌క్కుల‌ను కాల‌రాస్తూ.. పాల‌న సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆఫ్ఘనిస్తాన్ లో మ‌హిళా హ‌క్కులు అణ‌చివేయ‌బ‌డుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసిన నోబెల్ బహుమ‌తి గ్ర‌హీత మ‌లాలా యూస‌ఫ్‌జాయ్‌.. అక్క‌డ‌ మాన‌వ హ‌క్కుల‌ను కాపాడాలంటూ ప్ర‌పంచ దేశాల నాయ‌కుల‌ను కోరారు. తకుముందు, ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఆఫ్ఘన్ మహిళలు తల నుండి కాలి వరకు మొత్తం శ‌రీరాన్ని క‌ప్పివుంచేలా దుస్తులు ధ‌రించాలంటూ తాలిబాన్లు జారీ చేసిన ఆదేశాల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలకు హిజాబ్ తప్పనిసరి చేస్తూ తాలిబాన్ పాల‌కులు ఆదేశాలు జారీ చేయడంతో ఆఫ్ఘనిస్తాన్‌లోని మహిళలు మరియు బాలికల ప‌రిస్థితిపై నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ భయందోళ‌న‌ వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ మహిళల మానవ హక్కులను ఉల్లంఘించినందుకు తాలిబాన్‌లను బాధ్యులను చేయాలని ఆమె ప్రపంచ నాయకులను కోరారు. "తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లోని అంద‌రి జీవితాల‌ను అణచివేస్తూ పాల‌న సాగిస్తున్నారు. బాలికలు, మ‌హిళా హ‌క్కుల‌ను అణ‌చివేస్తున్నారు. బాలికలను పాఠశాలకు దూరం చేశారు. మహిళలను పనికి దూరంగా ఉంచుతున్నారు. మగ కుటుంబ సభ్యుడు తోడు లేకుండా ప్రయాణించ‌కుండా నిషేధం విధించారు. వారి పూర్తి శ‌రీరం క‌ప్పివుంచేలా దుస్తులు ధ‌రించాలంటూ వారిని బ‌ల‌వంతంగా అణ‌చివేయ‌బ‌డుతున్నారు.న ఇది అక్క‌డి మ‌హిళా హ‌క్కులను అణ‌చివేసే చ‌ర్య" అంటూ మ‌లాలా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

లక్షలాది మంది మహిళలు మరియు బాలికల మానవ హక్కులను ఉల్లంఘించినందుకు తాలిబాన్‌లను బాధ్యులను చేయడానికి సమిష్టి చర్య తీసుకోవాలని ఆమె ప్రపంచ నాయకులను కోరారు. "తాలిబాన్లు వారి వాగ్దానాలను ఉల్లంఘిస్తూనే ఉన్నందున మేము ఆఫ్ఘన్ మహిళల పట్ల మన హెచ్చరికను కోల్పోకూడదు. ఇప్పుడు కూడా, మహిళలు తమ మానవ హక్కులు మరియు గౌరవం కోసం పోరాడటానికి వీధుల్లోకి వస్తున్నారు.. మనమందరం మరియు ముఖ్యంగా ముస్లిం దేశాల‌ నుండి వారితో పాటు నిలబడాలి” అని మలాలా అన్నారు.  తకుముందు, ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఆఫ్ఘన్ మహిళలు తల నుండి కాలి వరకు మొత్తం శ‌రీరాన్ని క‌ప్పివుంచేలా దుస్తులు ధ‌రించాలంటూ తాలిబాన్లు జారీ చేసిన ఆదేశాల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  

తాలిబ‌న్లు తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దశలవారీగా, తాలిబాన్ స‌ర్కారు.. ఆఫ్ఘన్ మహిళల మానవ హక్కులను నిర్మూలిస్తోంది.. విద్య, కదలిక, ఉపాధి మరియు ప్రజా జీవితంపై ఆంక్షలతో పూర్తి జీవిత చ‌క్రాన్ని ఆంక్ష‌ల‌తో క‌ట్ట‌డి చేయడంపై UN ప్రత్యేక ప్రతినిధి రిచర్డ్ బెన్నెట్ సైతం ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. హ‌క్కులను నిర్మూలిస్తోంది, తప్పనిసరి ముఖ క‌ప్పుకోవ‌డం (హిజాబ్‌) అనే తాజా ఉత్త‌ర్వులు.  విద్య, ఉద్యమం, ఉపాధి మరియు ప్రజా జీవితంపై పరిమితులను కలుపుతోంది. మానవ హక్కుల ఉల్లంఘనలకు పరిణామాలు తప్పక ఉంటాయి.. అంద‌రూ క‌లిసి పనిచేయడానికి సమయం ఆసన్నమైంది" అని రిచర్డ్ బెన్నెట్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆఫ్ఘన్ లో తాలిబన్ సర్కారు ఏర్పడినప్పటి నుంచి ప్రజల భయాందోళనలు నెలకొన్నాయి. ఇదివరకు తాలిబన్ల రాక్షస పాలన.. వారి చర్యలను యావత్ ప్రపంచం గుర్తుచేస్తూ.. అక్కడి పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios