MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • Malala Yousafzai : ‘మలాలాలో నాకు నచ్చింది అదే..’ అస్సర్ మాలిక్..

Malala Yousafzai : ‘మలాలాలో నాకు నచ్చింది అదే..’ అస్సర్ మాలిక్..

నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ను వివాహం చేసుకున్న అస్సెర్ మాలిక్ భార్య గురించి ఓ హృదయపూర్వక సందేశాన్ని ట్వీట్ చేశారు. 

2 Min read
Bukka Sumabala
Published : Nov 11 2021, 08:51 AM IST| Updated : Nov 11 2021, 08:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌కు చెందిన నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ను ఇటీవల వివాహం చేసుకున్న అస్సెర్ మాలిక్ తన పెళ్లి గురించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. భార్య మలాలాతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోతో పాటు ఆమె కోసం heart-warming messageని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో "మలాలా రూపంలో, నాకు చాలా మంచి, సపోర్ట్ చేసే స్నేహితురాలు, అందమైన, దయగల భాగస్వామి దొరికారు - తనతో నా జీవితం మొత్తం కలిసి గడపబోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మా Nikkahకు శుభాకాంక్షలు తెలిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మా క్రికెట్ జట్టు సంప్రదాయాన్ని అనుసరించి, నిఖా తరువాత మేము victory cake కట్ చేశాం.." అని చెప్పుకొచ్చాడు.

26
malala yousafzai

malala yousafzai

Malala Yousafzai, నోబెల్ గ్రహీత, కార్యకర్త, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అధికారి అయిన అస్సర్ మాలిక్‌ను మంగళవారం UKలో ఒక సన్నిహిత వేడుకలో వివాహం చేసుకున్నారు.

లాహోర్‌కు చెందిన Asser Malik ఒక పారిశ్రామికవేత్త, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్ జనరల్ మేనేజర్. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీతో కూడా అస్సర్ మాలిక్ అసోసియేట్ అయి ఉన్నాడు. అతనికి సొంతంగా ప్లేయర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ కూడా ఉంది.

36
malala

malala

మలాలా యూసఫ్‌జాయ్ గత సంవత్సరం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో పట్టా పొందారు. మలాలా యూసఫ్‌జాయ్ మంగళవారం social mediaలో అస్సర్‌తో తన పెళ్లిని ప్రకటించింది. ఆమె తన marriage కి సంబంధించి.. భర్తతో కలిసి ఉన్న రెండు ఫొటోలను షేర్ చేసింది. దాని కింద ట్వీట్ చేస్తూ... "ఈ రోజు నా జీవితంలో ఒక అమూల్యమైన రోజు. జీవితాంతం కలిసి నడిచే ప్రయాణంలో భాగస్వాములుగా అసర్, నేను అడుగులు వేస్తున్నాం. మేము మా కుటుంబాలతో కలిసి బర్మింగ్‌హామ్‌లోని ఇంట్లో ఒక చిన్న నిక్కా వేడుకను జరుపుకున్నాం. దయచేసి మీ దీవెనలను మాకు పంపండి. మేము ముందుకు సాగడానికి కలిసి నడవడానికి సంతోషిస్తున్నాం" అని పెట్టింది. కాగా వీరిద్దరూ గత రెండేళ్లుగా కలిశారని, ఇద్దరి మధ్య చక్కటి అవగాహన తరువాతే పెళ్లి చేసుకున్నారని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

46

కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటీష్ స్క్రీన్ రైటర్,  పాకిస్థాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్ స్మిత్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖుల నుండి ఈ జంటకు Congratulatory wishes వెల్లువెత్తాయి. పిల్లలలో విద్య ప్రాముఖ్యతపై దృష్టి సారించే ప్రాజెక్ట్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన నోబెల్ శాంతి బహుమతి గ్రహీతతో కలిసి పనిచేసిన Priyanka Chopra, ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశంతో జంటను అభినందించారు, "అభినందనలు! మీకు చాలా ఆనందం, సంతోషం సొంతం కావాలి. మీకు ఒక సంపూర్ణ దృష్టి ఉంది" అంటూ ట్వీట్ చేశారు. 

56

మలాలా యూసఫ్‌జాయ్ జూలై 12, 1997న పాకిస్తాన్‌లోని పర్వతప్రాంతమైన స్వాత్ లోయలో జన్మించింది. education activist అయిన ఆమె తండ్రి జియావుద్దీన్ యూసఫ్‌జాయ్ అనేక బాలికల పాఠశాలలను నెలకొల్పాడు. అందులో మలాలా చదివింది. అక్టోబర్ 2007లో, తాలిబాన్ మిలిటెంట్లు లోయను స్వాధీనం చేసుకున్నారు. అనేక ఇతర ఆంక్షలతో పాటు బాలికలు విద్య మీద ఆంక్షలు విధించింది. అక్కడి పరిస్థితులను తానెదుర్కుంటున్న సంఘటనలను వివరిస్తూ బిబిసిలో ఆమె anonymous blog రాయడం ప్రారంభించింది. 

66

15 ఏళ్ల వయసులో 2012లో, బాలికల విద్య, హక్కుల కోసం మాట్లాడినందుకు తాలిబాన్ ముష్కరుడు మలాలా తలపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఘోరంగా గాయపడిన ఆమె UKలో చికిత్స పొందిన తర్వాత బయటపడింది, అక్కడ ఆమెకు ఆశ్రయం లభించింది.

Malala Yousafzahi: నోబెల్ బహుమతి గ్రహీత మలాలా ఇంట మోగిన పెళ్లి బాజా..

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే
Recommended image3
Putin walking style: పుతిన్ న‌డిచేప్పుడు కుడి చేయి ఎందుకు కదలదు.? ఏదైనా స‌మ‌స్యా లేక..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved