Asianet News TeluguAsianet News Telugu

Malala Yousafzahi: నోబెల్ బహుమతి గ్రహీత మలాలా ఇంట మోగిన పెళ్లి బాజా..

ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అస్సర్, నేను జీవిత భాగస్వాములం అయ్యాం. బర్మింగ్ హమ్ లోని మా ఇంట్లో ఇరు కుటుబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం.

Malala Yousafzai announces her marriage on Twitter
Author
Hyderabad, First Published Nov 10, 2021, 7:31 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బ్రిటన్ : నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ వివాహబంధంలో అడుగుపెట్టింది. బ్రిటన్ లోని బర్మింగ్ హమ్ లో గల తన నివాసంలో కుటుంబసభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. ఈ మేరకు 24 యేళ్ల మలాలా తన భాగస్వామి అస్సర్ తో కలిసి సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు.

‘ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అస్సర్, నేను జీవిత భాగస్వాములం అయ్యాం. బర్మింగ్ హమ్ లోని మా ఇంట్లో ఇరు కుటుబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం. మీ ఆశీస్సులు మాకు పంపించండి. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నాం’ అని Malala Yousafzai ట్వీట్ చేశారు. తన భర్త అస్సర్ తో దిగిన ఫొటోలను పంచుకున్నారు. 

పాకిస్తాన్ లోని స్వాత్ లోయలో జన్మించిన మలాలా బాలిక విద్య కోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తారు. దీంతో 2012లో Taliban పాఠశాల బస్సులోకి చొరబడి ఆమె మీద కాల్పులకు దిగారు. మలాలా ఎడమ కణితిపై, శరీరంపై తీవ్ర గాయాలు అయ్యాయి. 

దీంతో ఆమెను వెంటనే పెషావర్ కు తరలించి చికిత్స అందించండంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. అయితే, బుల్లెట్ గాయాల కారణంగా ఉత్తమ చికిత్స కోసం బ్రిటన్ కు తరలించారు. పలు శస్త్రచికిత్సల తరువాత మలాలా కోలుకున్నారు. అనంతరం బ్రిటన్ లోనే తల్లిదండ్రులతో కలిసి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. 

ఇక అప్పటి నుంచి మలాలా బాలిక విద్య కోసం పోరాడుతూనే ఉన్నారు. మలాలా ఫండ్ పేరుతో Girl's education కోసం ఛారిటీ సంస్థను నెలకొల్పారు. ఈ క్రమంలో తన సేవలను గుర్తించిన నోబెల్ కమిటీ 2014లో మలాలకు Nobel Peace Prizeని కూడా అందించింది. దీంతో 17 యేళ్ల అతిపిన్న వయస్కురాలిగా నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తిగా మలాలా వార్తల్లో నిలిచారు. 2020లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు. 

కాగా, గతంలో పాకిస్తాన్ కి చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాహిని పై కాల్పులకు తెగపడిన ఉగ్రవాది ఇషానుల్లా ఇషాన్ నిరుడు జైలు నుంచి తప్పించుకున్నాడు. బాలికల విద్య కోసం కృషి చేస్తోందనే కారణంతో  2012లో మలాలాపై ఈ ఉగ్రవాది కాల్పులకు తెగపడ్డాడు.  దీంతో.. ఆమె తలలోకి బెల్లెట్లు దూసుకుపోయాయి.

దోషికి కరోనా సోకడంతో నిలిచిన ఉరిశిక్ష.. సింగపూర్ కోర్టు సంచలన నిర్ణయం

అయితే... ఆమె చావుతో పోరాడి గెలిచింది. లండన్ లో పలు శస్త్ర చికిత్సల అనంతరం ఆమె తిరిగి కోలుకుంది. ఆమె ధైర్య సాహసాలకు, బాలికల విద్య కోసం ఆమె చేసిన కృషికి మెచ్చి నోబెల్ బహుమతి కూడా అందజేశారు.

అయితే... తాజాగా ఆ ఉగ్రవాది పాక్ జైలు నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సదరు ఉగ్రవాదే ఓ వీడియో విడుదల చేయడం గమనార్హం. తాను పోలీసుల చెర నుంచి తప్పించుకున్నానంటూ ఆ వీడియోలో ఉగ్రవాది ఇషాన్ చెప్పాడు. సోషల్ మీడియాలో అప్పట్లో ఈ వీడియో వైరల్ గా మారింది.

జనవరి 11వ తేదీన అతను పోలీసుల చెర నుంచి తప్పించుకున్నాడు. కాగా... 2012లో మలాలాపై దాడి చేశాడు, 2014లో పెషావర్ లో ఆర్మీ స్కూల్ పై దాడి చేసింది కూడా ఇతనే కావడం గమనార్హం. అయితే... 2017లో పోలీసులకు చిక్కాడు. తన డిమాండ్లు నెరవేర్చలేదనే కారణంతో జైలు నుంచి పరారయ్యానని ఉగ్రవాది చెబుతుండటం విశేషం. 

 

Follow Us:
Download App:
  • android
  • ios