1960 ఆగస్టు 26న నాగాల్యాండ్‌లోని పుర్ గ్రామంలో డకోటా ఫ్లైట్‌ను నేలకూల్చారు. ఆ డకోటా ఫ్లైట్‌లోని సిబ్బందిని నిర్బంధించారు. వారి విజయగాధను భారత వైమానిక దళ చరిత్రకారుడు అంచిత్ గుప్తా వివరిస్తున్నారు.
భారత వైమానిక దళ సుదీర్ఘ చరిత్రలో యుద్ధ విమానం మిగ్ 21 అసంఖ్యాక వేరియంట్లు సేవలు అందించాయి. ఔత్సాహికులకు మిగ్ 21 ఎన్నో ఆశ్చర్యకర, ఆసక్తికర విషయాలను ముందు ఉంచుతుంది. భారత వైమానిక దళ సేవల్లో మిగ్ 21 పరిణామ క్రమాన్ని ప్రముఖ ఐఏఎఫ్ చరిత్రకారుడు అంచిత్ గుప్తా అందిస్తున్నారు.
భారత వైమానిక దళంలో ఎలాంటి అంతరాయం లేకుండా సేవలు అందిస్తున్న లాంగెస్ట్ సర్వింగ్ స్క్వాడ్రన్ నెంబర్ 3. దీని చిహ్నంలోకి కోబ్రా వచ్చిన కథ ఆసక్తికరంగా ఉన్నది. అది 1942 కాలానికి చెందినది. మిరాన్షాలో 1942లో పుట్టిన ఈ క్రెస్ట్ గురించిన కథను ఐఏఎఫ్ హిస్టోరియన్ అంచిత్ గుప్తా వివరిస్తున్నారు.
భారత వైమానిక దళ చరిత్రకారులు అంచిత్ గుప్తా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలి చీఫ్ ఎంపిక ఎలా జరిగిందో వివరిస్తున్నారు. 1947లో జూన్, జులైలో 30 రోజుల వ్యవధిలో ఎలాంటి ట్విస్టులు, ఆసక్తికర పరిణామాల మధ్య ఈ ఎంపిక జరిగిందో రాశారు.
భారత వైమానిక దళ చరిత్రకారుడు అంచిత్ గుప్తా మిరాన్షాకు ఉన్న చారిత్రక ప్రశస్తిని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు. బర్మా క్యాంపెయిన్‌లోకి భారత వైమానిక దళ ప్రవేశానికి ఇదే బీజం వేసి ఉంటుందని చెబుతున్నారు.
భారత వైమానిక దళ చరిత్రకారుడు అంచిత్ గుప్తా 114 హెలికాప్టర యూనిట్, ‘సియాచెన్ పయనీర్లు’, కథను వివరిస్తున్నారు. ఈ యూనిట్ ఎప్పడూ ప్రకృతి పెట్టే పరీక్షలతోపాటు శత్రువుల దాడులను ఎదుర్కొంటూ ముందుకు సాగింది. వైమానిక ప్రపంచంలో ఈ యూనిట్ విశిష్టమైనది.
స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఇంగ్లాండ్ వదిలిపెట్టిన యుద్ధ విమానాలకు భారత్ అవసరానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన సీ-87 లిబరేటర్ అనే అమెరికా వైమానిక దళానికి చెందిన విమానాన్ని భారత్ గొప్ప కార్యానికి వినియోగించింది. ఈ విమానానికి అనేక మార్పులు చేసి తొలి సారి ఎవరెస్టు శిఖరం ఎల్లలు దాటించింది. దాని అద్భుతమైన చిత్రాలను ప్రపంచానికి అందించింది. ఒక్కసారిగా భారత ప్రతిష్ట ఎవరెస్టుకు మించి విస్తరించింది.
ఎవరెస్టు పర్వతం మీదుగా సాగిన తొలి వైమానిక ప్రయాణం గురించి, ఆ ప్రయాణం గురించి చేసిన కృషి, దాని ప్రాధాన్యతలను వివరిస్తూ అంచిత్ గుప్తా అందిస్తున్న కథనం ఇది. ఈ ఆసక్తికర కథనంలో ఎవరెస్టు పర్వతాన్ని విమానంలో ఎగిరి ఫొటోలు తీయడం గురించి ప్రస్తావించారు.
భారత దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత వైమానిక దళం సొంతంగా అకాడమీని అభివృద్ధి చేసుకుంది. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటూ సొంతంగా సుశిక్షితులైన పైలట్లను తయారు చేసుకుంటున్నది. ఈ అద్భుత ప్రయాణం గురించి ఐఏఎఫ్ చరిత్రకారుడు అంచిత్ గుప్తా చర్చిస్తున్నారు.
భారత వైమానిక దళానికి చెందిన సుమారు 80 మంది పైలట్లు 1963 నుంచి 66 మధ్య కాలంలో అమెరికా వైమానిక దళంతో శిక్షణ పొందారు. ఆ సమయంలో వారు అత్యంత శక్తి మంతమైన ఎఫ్-86 సేబర్ విమానాలపై పట్టు సంపాదించారు. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన సేబర్ విమానాలను కూల్చడంలోనూ పరాక్రమాన్ని చూపించారు.