Asianet News TeluguAsianet News Telugu

From the IAF Vault: భారత వైమానిక దళ టాప్ అకాడమీ.. స్వతంత్ర భారత్ సొంతంగా అభివృద్ధి చేసుకున్న సంస్థ

భారత దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత వైమానిక దళం సొంతంగా అకాడమీని అభివృద్ధి చేసుకుంది. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటూ సొంతంగా సుశిక్షితులైన పైలట్లను తయారు చేసుకుంటున్నది. ఈ అద్భుత ప్రయాణం గురించి ఐఏఎఫ్ చరిత్రకారుడు అంచిత్ గుప్తా చర్చిస్తున్నారు.
 

from the IAF Vault story of IAFs own top gun academy.. and its evolution through the time
Author
First Published Sep 1, 2022, 9:05 PM IST

న్యూఢిల్లీ: గగనతల యుద్ధ చరిత్ర యుద్ధ విమానాలతోనే ప్రారంభమైంది. స్వాతంత్ర్యం పొంది సొంతంగా తన కాళ్ల మీద నిలబడుతున్న భారత దేశం.. గగనతల యుద్ధ మెళకువలు, పైలట్లను సుశిక్షితులను చేసుకోవడానికి 1940, 1950లలో రాయల్ ఎయిర్ ఫోర్స్ వైపు చూసేది. దీని ద్వారా భారత్ కేవలం కొంత మంది పైలట్లను మాత్రమే తయారుచేసుకునేది. అదీగాక, సొంతంగా ఒక వ్యవస్థ లేనందునా మెళకువులు, నైపుణ్యాలు ఒంటబట్టించుకున్న పైలట్లు ఆ నైపుణ్యాలను ఇతరులకు నేర్పించే అవకాశం లేకుండా పోయింది.

ఈ అవరోధాన్ని అధిగమించాలని భారత వైమానిక దళం ఆలోచనలు చేసింది. 1950, 1952 మధ్యకాలంలో పైలట్ అటాక్ ఇన్‌స్ట్రక్టర్స్ కోర్స్ కోసం నలుగురు పైలట్లను ఆస్ట్రేలియకు పంపింది. 1950 దశకం మధ్యంలో మరికొందరిని యూకేకు పంపింది. ఇక్కడ నైపుణ్యాలు నేర్చుకున్న పైలట్లు ఐఏఎఫ్ స్క్వాడ్రన్ పైలట్లకు బట్వాడా చేయాలనే ప్లాన్ అప్పుడు భారత్ ఆలోచించింది.

అదే విధంగా ఇతర నైపుణ్యాల కోసం ట్రైనింగ్ వింగ్(ఏటీడబ్ల్యూ) ఏర్పాటు చేయాలని తలచింది. 1950లో ఆర్మమెంట్ ట్రైనింగ్ వింగ్‌ను జామ్‌నగర్‌లో ఏర్పాటు చేసింది. 1956లో పైలట్ అటాక్ ఇన్‌స్ట్రక్టర్ స్కూల్‌ను స్థాపించింది. 1960వ దశకంలో ఎక్కువ కాలం ఇన్‌స్ట్రక్టర్‌గా వింగ్ కమాండర్ జీడీ నాబీ క్లార్క్ సేవలు అందించాడు. కమాండింగ్ ఆఫీసర్, ఏటీడబ్ల్యూలో చీఫ్ ఇన్‌స్ట్రక్టర్‌గానూ చేశాడు. 

1958 ఏప్రిల్‌లో దేశీయంగా స్థాపించిన ఈ సంస్థ నుంచి తొలి గ్రాడ్యుయేట్లు బయటకు వచ్చారు. 1958 నుంచి 1970 వరకు 24 కోర్సులు నేర్పారు. సుమారు 200 మంది పైలట్లు ఇక్కడ శిక్షణ పొందారు. టాక్టిక్స్ డెవలప్‌మెంట్, ఎయిర్ టు ఎయిర్ కంబాట్ శిక్షణ కోసం ఇప్పటికీ చాలామంది పైలట్లను యూకేకు డే ఫైటర్ లీడర్ కోర్సుకు పంపుతుంటారు. ఈ కోర్సుకు జానీ గ్రీన్, దిల్బాగ్ సింగ్, ఎస్ రాగ్స్ రాఘవేంద్రన్ కూడా అటెండ్ అయ్యారు. 1957లో యూకే రివ్యూ పాలసీ తర్వాత సాంప్రదాయ యుద్ధ విద్యలకు ప్రాధాన్యత తగ్గింది. డీఎఫ్ఎల్ కోర్సు ఆపేశారు. గన్ వర్సెస్ డిబేట్ చర్చ వచ్చింది. 

రాగ్స్ రాఘవేంద్రన్ కూడా కోర్సు మార్పుల కోసం ప్రయత్నించాడు. కానీ, ఫండ్స్ రాక.. అనుమతులూ అందక 1962, 1965 యుద్ధాలతో ఈ ప్రయత్నం ఇంకొంత కాలం వాయిదా పడింది. 1972 వరకు అంటే 15 సంవత్సరాలు ఐఏఎఫ్ ఫైటర్ శిక్షణ లేకుండా గడిచిపోయింది. 1965 యుద్ధంతో దీని ఆవశ్యకతను బలంగా ముందుకు తెచ్చింది. ఫలితంగా ఎయిర్ చీఫ్ మార్షల్ పీసీలాల్‌కు ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వేగంగా అనుమతులు వచ్చాయి. టాక్టిక్స్ అండ్ కంబాట్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ (టీసీడీటీఎస్) యూనిట్‌ను స్థాపించారు. మిగ్ 21, సుఖోయ్ 7 యుద్ధ విమానాలను ఈ యూనిట్‌కు అప్పగించారు. 1971 ఫిబ్రవరి 1వ తేదీన 211 మంది ఆఫీసర్లు, ఇతరులు ఈ యూనిట్ కోసం రిపోర్ట్ చేశారు. ఏడాది కాలం ఎక్స్‌పెరిమెంట్స్ చేశారు.

1971లో అంబాలాకు ఈ యూనిట్ తరలించారు. ఇక్కడ యూనిట్ స్థాపించే పనులు జరుగుతుండగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అప్పుడు టీసీడీటీఎస్‌కు పాకిస్తాన్ వైమానిక బేస్‌లపై లో లెవెల్‌లో దాడులు నిర్వహించే టాస్క్ ఇచ్చారు. కానీ, అప్పుడు మిగ్ 21, సుఖోయ్ 7 అందుకు సిద్ధంగా లేవు. పైలట్లు సరైన విధంగా శిక్షణ పొందలేు. అయినా.. ఈ పనిని దిగ్విజయంగా చేపట్టింది. 293 రౌండ్లు వేసి చాలా వరకు దాడులు చేసింది. వాటిని మళ్లీ రిపేర్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఈ దాడులు దారుణంగా దెబ్బతీశాయి. 

1972 మే నెలలో వింగ్ కమాండర్ ఏ శ్రీధరన్ చార్జ్ తీసుకున్నారు. ఆయన రెండేళ్ల బాధ్యతల కాలంలో యూనిట్ పేరును టాక్టిక్స్ అండ్ కంబాట్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (టీఏసీడీఈ)గా మార్చి జామ్‌నగర్‌కు తరలించారు.

1972 నుంచి 1974 వరకు టీఏసీడీఈ స్టాఫ్ ఫ్లయింగ్ టెక్నిక్స్, టాక్టిక్స్, బ్రీఫింగ్ నోట్స్, ప్రయోగాలను విజయవంతంగా ప్రవేశపెట్టారు. టూ వర్సెస్ టూ, టూ వర్సెస్ ఫోర్, 10 విమానాల మిక్స్‌డ్ ఫార్మేషన్ ఫ్లయింగ్‌, స్ట్రైక్ మిషన్‌పై ప్రయోగాలు చేశారు. దాదాపు యుద్ధ విమానాల సామర్థ్యాల అవధులను చేరుకున్నారు.

1982 జూన్ కల్లా మిగ్ 21 ఎఫ్ఎల్, సుఖోయ్ 7 కాలం చెల్లినవి. మిగ్ 21 బై, మిగ్ 21 ఎం/ఎంఎఫ్‌లను కొత్తగా చేర్చారు. మరో 12 ఏళ్లు మిగ్ 21 టీఏసీడీఈలో కొనసాగింది.

1989 నుంచి 1997 వరకు టీఏసీడీఈల వేగంగా అభివృద్ధి చెందింది. 2000లో టీఏసీడీఈ జామ్‌నగర్ నుంచి గ్వాలియర్‌కు తరలింది. మరెన్నో కొత్త యుద్ధ విమానాలు చేరాయి. అందుకు సంబంధించిన టెక్నిక్‌లు అప్‌డేట్ చేసుకుంటూ వెళ్లారు. ఈ ఏడాది టీఏసీడీఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలు చేసుకుంది.

 

-- (అంచిత్ గుప్తా మిలిటరీ కుటుంబంలో జన్మించారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఈక్విటీ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. భారత వైమానిక చరిత్రలో ఆయనకు ఆసక్తి ఎక్కువ. అందుకే భారత వాయు సేన చరిత్రను పలు వేదికలపై పంచుకుంటుంటారు.)

Follow Us:
Download App:
  • android
  • ios