Asianet News TeluguAsianet News Telugu

From the IAF vault: భారత వైమానిక దళ పరాక్రమ పైలట్లు.. పాక్ జెట్లు పేల్చిన ధీరులు

భారత వైమానిక దళానికి చెందిన సుమారు 80 మంది పైలట్లు 1963 నుంచి 66 మధ్య కాలంలో అమెరికా వైమానిక దళంతో శిక్షణ పొందారు. ఆ సమయంలో వారు అత్యంత శక్తి మంతమైన ఎఫ్-86 సేబర్ విమానాలపై పట్టు సంపాదించారు. ఆ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన సేబర్ విమానాలను కూల్చడంలోనూ పరాక్రమాన్ని చూపించారు.

from the IAF vault IAF fighter pilots who flew F-86 Sabre and slew them of pakistan
Author
First Published Aug 24, 2022, 1:20 PM IST

న్యూఢిల్లీ: ఇది భారత వైమానిక దళానికి చెందిన పరాక్రమ పైలట్లు గురించి వివరించే స్టోరీ.. అమెరికా ఎయిర్ ఫోర్స్‌తోపాటుగా ఎఫ్-86 సేబర్ ఫ్లైట్‌లు ఎగరేసిన పైలట్ల ధీరత్వాన్ని తెలిపే కథనం. యూఎస్ ఎయిర్ ఫోర్స్‌తో 1963-66ల మధ్య శిక్షణ పొందిన భారత సైనికుల గురించి.. అవే శక్తిమంతమైన ఎఫ్-86 సేబర్‌ను కూల్చేసిన వీర పైలట్ల గురించి చర్చించే కథనం ఇదీ..

1962లో ఇండియా, చైనాల మధ్య యుద్ధం కమ్ముకువచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు మన దేశానికి రెండు అనూహ్య విషయాలు కలిసి వచ్చాయి. చైనాను ఎదుర్కోవడానికి సైన్యం శిక్షణ, మిలిటరీ సహకారం కోసం భారత్.. అమెరికా, బ్రిటీష్ మిలిటరీ నుంచి సహాయం కోరింది. ఈ రెండు దేశాలూ మన దేశానికి సహకరించడానికి అంగీకరించాయి. తద్వార భారత వైమానిక దళంలో సుశిక్షితులైన పైలట్లు చేరడంతోపాటు చైనాను ఢీ కొట్టడానికి సరిపడా మిలిటరీ సహకారం అందింది.

అమెరికా వైమానిక దళం.. భారత్, లాటిన్ అమెరికా దేశాలు, ఫార్ ఈస్ట్రన్, నాటో దేశాలు, ఇరాన్, పాకిస్తాన్‌కు చెందిన మిలిటరీకి పైలట్లకు శిక్షణ ఇచ్చింది. లాక్‌లాండ్, రాండాల్ఫ్, నెల్లీస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లలో సుమారు ఆరు నెలలపాటు ఈ శిక్షణ సాగింది. సుమారు మూడు సంవత్సరాల్లో భారత్ 82 పైలట్లకు ఇక్కడ శిక్షణ ఇప్పించింది.

తొలి మాసం లాక్‌లాండ్‌లో ఇంగ్లీష్ శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత రాండాల్ఫ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో కన్వర్షన్ ట్రైనింగ్, టీ-33ఏ ట్రైనర్ విమానం ఎగరేసే శిక్షణ ఇచ్చారు. చివరగా నెల్లిస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో టీ-33ఏతోపాటు ఎఫ్-86 సేబర్ ఫైటర్ జెట్లను ఎగరేయడాన్ని మన పైలట్లకు నేర్పారు. ఇందులో ఆకాశంలో నుంచి నేలపై లక్ష్యాన్ని, ఆకాశంలో నుంచి ఆకాశంలోనే ఉన్న లక్ష్యాన్ని ధ్వంసం చేయడాన్ని నేర్చుకోగలిగారు. 

నెల్లిస్‌లో తొలి నెలలో టీ-35ఏలతో సోలో ఫార్మేషన్ నేర్చుకున్నారు. ఎయిర్ టు గ్రౌండ్ అటాకింగ్ నేర్చుకున్నారు. ఆ తర్వాత పాకిస్తాన్, ఇరాన్, లాటిన్ అమెరికకా, నాటో పైలట్లతో కలిసి నాలుగు విమానాలు ఎగరేస్తూ సమన్వయంలో దాడి చేయడాన్ని నేర్చుకున్నారు. అదే విధంగా ఎఫ్-86ఎఫ్ సేబర్ ఫ్లైట్‌ ఎగరేయడాన్నీ, దానితో యుద్ధం చేయడాన్నీ నేర్చుకున్నారు.

శిక్షణ పూర్తయిన వారికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. అంతేకాదు, ది బెస్ట్ ఉన్నవారికీ మూడు రకాల ట్రోఫీలు ఇచ్చారు. భారత్ నుంచి ఐఏఎఫ్ అధికారులు వీకే భాటియా, దదూ సుబయ్య, వీ విద్యాధర్‌లు ఈ ట్రోపీలు గెల్చుకున్నారు.

ఈ శిక్షణ ద్వారా భారత పైలట్లు ఎన్నో యుద్ధ మెళకువలు నేర్చుకున్నారు. ఎఫ్-86ఎఫ్ సేబర్ ఫ్లైట్‌ను బెటర్‌గా అర్థం చేసుకున్నారు.

1965 మార్చి నుంచి అక్టోబర్ కాలంలో ఈ ట్రైనింగ్‌కు అటెండ్ అయిన సుక్రుత్ రాజ్ 1971 యుద్ధంలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన సేబర్‌ను మట్టికరిపించాడు. ఆయనకు వీర్ చక్ర అవార్డు దక్కింది.

1996లో శిక్షణ పూర్తి చేసుకున్న దినేశ్ చందర్ ‘డానీ’ నయ్యర్ కూడా 1971 యుద్ధంలో సేబర్‌ను నేల కూల్చాడు. వీర చక్ర అవార్డు పొందారు. అదే యుద్దంలో సుఖోయ్ 7ను ఎగరేస్తున్న జిమ్మీ భాటియా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లోకి లోతుగా చొచ్చుకెళ్లి మూడు సేబర్ ఫైటర్ జెట్లను ధ్వంసం చేశారు. దీని ద్వారా ఆయన రెండోసారి వీర చక్ర పురస్కారం పొందారు.

 

-- (అంచిత్ గుప్తా మిలిటరీ కుటుంబంలో జన్మించారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఈక్విటీ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. భారత వైమానిక చరిత్రలో ఆయనకు ఆసక్తి ఎక్కువ. అందుకే భారత వాయు సేన చరిత్రను పలు వేదికలపై పంచుకుంటుంటారు.)

Follow Us:
Download App:
  • android
  • ios