Asianet News TeluguAsianet News Telugu

From the IAF vault: సియాచెన్‌ను ఏలిన హెలికాప్టర్ల స్టోరీ

భారత వైమానిక దళ చరిత్రకారుడు అంచిత్ గుప్తా 114 హెలికాప్టర యూనిట్, ‘సియాచెన్ పయనీర్లు’, కథను వివరిస్తున్నారు. ఈ యూనిట్ ఎప్పడూ ప్రకృతి పెట్టే పరీక్షలతోపాటు శత్రువుల దాడులను ఎదుర్కొంటూ ముందుకు సాగింది. వైమానిక ప్రపంచంలో ఈ యూనిట్ విశిష్టమైనది.
 

from the IAF Vault.. A story about Siachen pioneers
Author
First Published Oct 1, 2022, 3:11 AM IST

న్యూఢిల్లీ: భారత వైమానిక దళంలో 114 హెలికాప్టర్ యూనిట్‌ విశిష్టమైనది. సాహసాలతో నిండినది. అసాధ్యానికి చోటులేని యూనిట్ అది. లేహ్ బేస్‌లో రెండు హెలికాప్టర్‌లతో ఈ యూనిట్ 1964 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. లేహ్‌లో ఇప్పటికీ కొనసాగుతున్న శాశ్వత ఐఏఎఫ్ యూనిట్ ఈ 114 యూనిట్.

లేహ్ చాలా కఠినమైన ప్రాంతం. వైమానిక దళానికి ఎప్పుడూ సవాళ్లే ఉండేవి. 114 యూనిట్‌లో ఉండేవారంతా కష్టానికి అలవాటు పడ్డవారే. ధైర్యసాహసాలు మెండుగా ఉన్నవారే. ఫ్రాన్స్‌లో శిక్షణ పొందిన పైలట్లు ఇందులో చేరారు. తొలుత ఈ యూనిట్‌లో ఫ్రెంచ్ అలౌటి III హెలికాప్టర్లు తీసుకున్నారు. దీని డిజైన్ విలక్షణమైనది. అందుకే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పలు అవతారాల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ, దీని సీలింగ్ 10,500 అడుగులు మాత్రమే. ఇది లేహ్ ఎత్తుకు దాదాపు సమానం. అందుకే ఇది లేహ్ నుంచి ఎప్పుడూ ఇంకా ఎత్తుకు ఎగరలేకపోయింది. అప్పటి నుంచే 114 యూనిట్ సాహసాలు మొదలయ్యాయి.

ఖార్డుంగ్లా దాటేటప్పుడు ఇంజిన్ ఫెయిలై ఓ హెలికాప్టర్ క్రాష్ అయింది. మరో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌లో సమస్య కారణంగా ముర్గో (16 వేల అడుగులు) దగ్గర ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఇంజిన్ మార్పు చేయడం అనేది అప్పుడు చాలా సాధారణంగా ఉండింది.

1965లో యుద్దం జరుగుతున్నప్పుడు క్షతగాత్రులను తరలించడానికి, ఇతర సహాయాల కోసం 114 చెతక్ హెలికాప్టర్లతో బిజీగా ఉండేది. వీఐపీ పర్యటనలు, ఇంటెలిజెన్స్ అధికారుల భేటీలకూ వీటిని వినియోగించేవారు.  1965 నుంచి 1971 కాలంలో ఈ యూనిట్‌లో హెలికాప్టర్‌ల సంఖ్య 10కి  పెరిగింది. ఈ యూనిట్‌కు చెందిన ఓ హెలికాప్టర్ తొలిసారి చండిగడ్, కులు, కీలాంగ్, లే రూట్‌ను క్లియర్ చేసింది. భారత వైమానిక దళంలో తొలిసారి ఇది జరిగింది.

1971లోనూ మళ్లీ క్షతగాత్రుల తరలింపులు, ఇతర అత్యవసర పనులు ఈ యూనిట్ చేపట్టింది. ముఖ్యంగా కార్గిల్, ఉరి సెక్టార్‌లో వీటి సేవలు ఎక్కువగా ఉన్నాయి. ఇతర శీతోష్ణస్థితుల సవాళ్లతోపాటు శత్రువుల దాడి ముప్పూ ఉండేది. ఆ తర్వాతే కొన్ని చేతక్‌లకు ఏస్-11బీ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సియాచెన్‌కు ఈ యూనిట్ వెళ్లింది. 

1985లో 114 యూనిట్‌ను గ్లేసియర్ పయనీర్ అని పిలిచేవారు. 19990 ప్రాంతంలో ఈ పేరు సియాచెన్ పయనీర్లుగా మారింది. ఇప్పటికీ ఇలాగే పిలుస్తారు. 

1978లో ఈ తరలింపు జరిగింది. సెకండ్ లెఫ్టినెంట్ మోంగా, ఫ్లైయింగ్ ఆఫీసర్ మన్మోహన్ బహదూర్‌లు అప్పుడు 1978 అక్టోబర్ 6న జెడ్ 1410లోని గ్లేసియర్‌పై ల్యాండ్ అయ్యారు. 15,500 అడుగుల ఎత్తులో ల్యాండ్ అయిన ఈ ఘటనకు గుర్తింపు దక్కలేదు. నిజానికి ఆపరేషన్ మేఘదూత్ ప్రకటించడానికి ముందే సియాచెన్ రక్షించబడింది.

సివిల్ ఎయిడ్ పాత్రలోనే ఉన్న ఈ యూనిట్‌కు అప్పటికే అనేక బహుమానాలు దక్కాయి. ఐదు శౌర్య చక్ర పురస్కారాలు లభించాయి.

1984 మార్చి చివరి కల్లా 114 యూనిట్ సియాచెన్‌ను రెక్కీ చేయడం ప్రారంభించింది. ఎయిర్ ఆఫీసర్ ఇంచార్జీ అధికారి ఒకరు లైటర్ చీతాహ్ హెలికాప్టర్‌ను దర్బుక్‌లో ఎగరేయడాన్ని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఇడ్రిస్ హసన్ లతీఫ్ 1981లో నోటీస్ చేశాడు. వెంటనే అవి 114 యూనిట్‌కు కావాలని ఆర్డర్ చేశాడు. దీంతో తొలుత రెండు చీతాలు ఈ యూనిట్‌కు వచ్చాయి. తర్వాతి ఆరేళ్లలో వారు రెండూ ఎగరేశారు. 1987లో కేవలం చీతా హెలికాప్టర్లు గల యూనిట్‌గా మారింది. నిజానికి సియాచెన్‌లో ఉండే గడ్డు పరిస్థితులకు ఇది అవసరమైన నిర్ణయం. స్వాగతించాల్సిన విషయం. ఆక్సిజన్ కూడా అందనంత ఎత్తులో మనుషులకు, మషీన్‌లకూ కష్టంగానే ఉండేది. ఇక్కడ పని చేసే వారు.. హెలికాప్టర్‌ల సామర్థ్యాలను కొలవడం తప్పనిసరి అయ్యేది.

ఇక్కడ వాతావరణ తీవ్రతలు, భౌగోళిక సవాళ్లతోపాటు తరుచుగా జరిగే శత్రువుల దాడులూ మరో ప్రధాన సవాలుగా ఉండేది. సియాచెన్ యాక్టివ్ వార్‌జోన్‌గా ఉండింది. 1985 నుంచి 2000 కాలంలో 114 యూనిట్‌కు చెందిన ఇద్దరు వీర చక్ర అవార్డులు, ఐదు యుధ్ద సేవా మెడల్స్, వాయుసేన మెడల్స్, కమెండేషన్‌లు చాలా పొందారు.

సామర్థ్యాల అంచుల్లో హెలికాప్టర్లను ఎగిరించడం ప్రాణాంతకంగా ఉండేది. కొన్నిసార్లు ఆ హెలికాప్టర్లు పైలట్లతో సహా మాయమైపోయేవి. మరికొన్ని సార్లు శత్రువుల తూటాలను ఎదుర్కొనేవి. కానీ, 114 యూనిట్ సోల్జర్లు మాత్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. వారి అవార్డు ప్రకటనలు వింటే ఒల్లు గగుర్పొడుస్తుంది.

ఇందుకు ఓ ఉదాహరణ చూడొచ్చు. 1990 జులై 3న ఓ హెలికాప్టర్ ఇంజిన్ 19500 అడుగుల ఎత్తులో పాడైంది. 182 కిలోల దీని ఇంజిన్‌ను సిఖ్ లైట్ ఇన్‌ఫాంట్రీ ఉన్న హెలిప్యాడ్‌లోనే మార్చాల్సి ఉంటుంది. ఇందుకోసం వారేం చేశారంటే.. రికవరీ హెలికాప్టర్ కోసం వారు ఆ హెలికాప్టర్‌ను ఫిజికల్‌గా మూవ్ చేశారు. ఇంజిన్ మార్చే పనిని ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీపాల్‌కు అప్పగించగా.. సీవో వింగ్ కమాండర్ గోలి స్యంగా బ్యాటరీలేని ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఇంజిన్‌ను తీసుకువచ్చారు. మరో వైపు పాకిస్తాన్ ఆర్మీ నుంచి నిరంతరం కాల్పుల మోత మోగుతుండగానే ఈ పనిలో పడ్డారు. జులై 13న సెకండ్ లెఫ్టినెంట్ సిన్హా, ఫ్లైట్ లెఫ్టినెంట్ మాల్హిలు ఎయిర్‌క్రాఫ్ట్ రికవరీ కోసం అమర్‌లో ల్యాండ్ అయ్యారు. అదృష్టవశాత్తు ఆ ఇంజిన్ మొదటిసారికే స్టార్ట్ అయింది. 

1996లో 114 హెలికాప్టర్ యూనిట్ ప్రెసిడెంట్స్ స్టాండర్డ్ అవార్డుపొందింది. కర్మభూమిలోని 114 సోల్జర్లు ఇప్పుడు చీతల్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లు, క్రూలు మారిపోయి ఉండొచ్చు.. కానీ, స్పిరిట్ మాత్రం అలాగే కొనసాగుతున్నది.

 

-- (అంచిత్ గుప్తా మిలిటరీ కుటుంబంలో జన్మించారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఈక్విటీ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. భారత వైమానిక చరిత్రలో ఆయనకు ఆసక్తి ఎక్కువ. అందుకే భారత వాయు సేన చరిత్రను పలు వేదికలపై పంచుకుంటుంటారు.)

Follow Us:
Download App:
  • android
  • ios