Asianet News TeluguAsianet News Telugu

From the IAF Vault: ఎవరెస్టు పర్వతం మీదుగా సాగిన తొలి వైమానిక ప్రయాణం.. ఆసక్తికర కథనం

ఎవరెస్టు పర్వతం మీదుగా సాగిన తొలి వైమానిక ప్రయాణం గురించి, ఆ ప్రయాణం గురించి చేసిన కృషి, దాని ప్రాధాన్యతలను వివరిస్తూ అంచిత్ గుప్తా అందిస్తున్న కథనం ఇది. ఈ ఆసక్తికర కథనంలో ఎవరెస్టు పర్వతాన్ని విమానంలో ఎగిరి ఫొటోలు తీయడం గురించి ప్రస్తావించారు.
 

from the IAF Vault.. this is the story about first flight over mount everest
Author
First Published Sep 9, 2022, 12:19 AM IST

న్యూఢిల్లీ: ఎవరెస్టు పర్వతం పై ఎగిరిన తొలి భారత వైమానిక దళం విమానం గురించి రీసెర్చ్ చేస్తుండగా నాకు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. దాని గురించి ఇక్కడ పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. ఏవియేషన్ రంగంలో ముందడుగులు వేసిన ధైర్యవంతుల గురించి ఇక్కడ చర్చిస్తాను. ఈ స్టోరీ మొత్తంగా భారత దేశాన్ని మరింత ఇంట్రెస్టింగ్‌గా మలుస్తుంది. ఈ స్టోరీ కేంద్రబిందువుగా డేమ్ ఫ్యానీ లూసీ హోస్టన్ ఉంటారు. ఈమె ఫైర్ బ్రాండ్ నేషనలిస్ట్. 1931లో ష్నైడర్ ట్రోఫీ గెలుచుకోవడానికి సూపర్‌మెరైన్‌కు 100,000 పౌండ్లు విరాళం ఇచ్చింది. రెండళ్ల తర్వాత ఆమె మన దేశం పై ముఖ్యంగా ఎవరెస్టు పర్వతంపై దృష్టి పెట్టింది.

ఎవరెస్టు ఫొటోగ్రాఫింగ్ ఐడియాను ఆమె ముందుకు స్క్వాడ్రన్ లీడర్ డగ్లస్ డగ్లస్ హామిల్టన్ తెచ్చారు.

ఎవరెస్టు పర్వతం సగం టిబెట్, సగం నేపాల్‌లో ఉంటుంది. బ్రిటీష్ టెరిటరీకి ఇవి సుమారు 100 మైళ్ల దూరంలో ఉన్నాయి. టిబెట్, నేపాల్ రెండూ స్వతంత్ర రాజ్యాలు. యూరోపియన్ జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవి. ఎవరెస్టు పర్వతం పై ఎగరాలంటే ఈ రెండు రాజ్యాలతో దౌత్యపరంగా చర్చలు చేయాల్సి వచ్చింది.

లూసీ వాగ్దానం చేసిన 15వేల పౌండ్లతో ఐఏఎఫ్‌ వాపితి ఎయిర్‌క్రాఫ్ట్‌కు కజిన్‌గా భావించే వెస్ట్‌లాండ్ పీవీ6, పీవీ3లను కొనుగోలు చేసి తెచ్చారు. ఆ సమయంలో అత్యధిక ఎత్తు ఎగిరే విమానంగా పీవీ3కి పేరుంది. 2.3 టన్నుల బరువును 260 కేఎంపీహెచ్ వేగంతో ప్రయాణించగలదు. ఎవరెస్టు పర్వతాలను చిత్రించడానికి విలియమ్‌సన్ ఆటోమేటిక్ ఈగల్ 3 సర్వే క్యామెరాను ఉపయోగించారు.

హామిల్టన్, బ్లాకర్‌లు విమానాన్ని లీడ్ చేయగా.. రెండో ఎయిర్‌క్రాఫ్ట్‌లో మెక్ ఇంటైర్, సిడ్నీ బానెట్ (గమోంట్ బ్రిటీషన్ న్యూస్ సినిమాటోగ్రాఫర్)లు ఉన్నారు.

బ్లాకర్ మన దేశానికి 1933 ఫిబ్రవరిలో గ్రౌండర్ వర్క్ చేసుకోవడానికి వచ్చాడు. ఇది కచ్చితంగా సక్సెస్ అవుతుంది, అన్ని అనుకున్నట్టు సజావుగా సాగుతాయని, ప్రాణ నష్టం జరగకుండా చూడగలనని విశ్వాసంతో ఉన్నాడు. వీరి ప్రాజెక్టుకు అనూహ్యంగా ఎయిర్ మినిస్ట్రీ నుంచి మద్దతు లభించింది. హామిల్టన్ తమకు మంచి మిత్రుడని, మంచి పైలట్ అని పేర్కొంట వైస్‌రాయ్‌కు లేఖ అందింది. ఈ రెండు విమానాలను కరాచీని రిసీవ్ చేసుకునే కార్యక్రమంలో వైస్‌రాయ్, ఆయన సతీమణి కూడా పాల్గొన్నారు. 

నేపాల్ నుంచి భగల్‌పూర్ కమిషనర్ పర్మిషన్ తీసుకుంది. బిహార్ పుర్నియాలోని రేస్ కోర్సు లాంచ్ ఎయిర్‌ఫీల్డ్‌గా మలుచుకున్నారు. బర్మా షెల్.. ఈ విమానాలకు ఇంధనం అందించడానికి సిద్ధమైంది.

1933 ఏప్రిల్ 3న ఉదయం 8.25 గంటలకు ఈ విమానాలు గాల్లోకి ఎగిరాయి. కొన్ని సమస్యలతోనైనా పర్వతాలపై ఎగరగలిగారు. కానీ, మంచి క్వాలిటీతో ఫొటోలు తీయలేకపోయారు. డస్ట్ మూలంగా ఫొటోలు బాగా రాలేవు. కాంచన్‌జంగ నుంచి సహచరులు ఈ సాహసానికి పూనుకున్నారు. కానీ, వాతావరణ సమస్యల వల్ల రెండో ప్రయత్నం వాయిదా పడింది. అయితే, ఈ ట్రిప్‌పై వ్యతిరకత మొదలవుతున్నది. లేడీ హోస్టన్ కూడ సున్నితంగా హెచ్చరికలు చేశారు. కానీ, బ్లాకర్, ఆయన టీమ్ మాత్రం తమ కార్యాన్ని చేపట్టాల్సిందేనని ఫిక్స్ అయ్యారు. వారి సహచరులకూ ఈ విషయాన్ని తెలుపలేదు. తమకు స్పష్టంగా వద్దనే ఆదేశాలు రాకముందే ఈ ప్రయత్నం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు.

1933 ఏప్రిల్ 19న నేపాల్ పూర్తిగా మేఘాలతో కమ్ముకుని ఉన్నది. 24 వేల అడుగుల ఎత్తులో గాలులు గంటకు 80 మీటర్ల వేగంతో వస్తున్నాయి. కాబట్టి, తక్కువ ఎత్తులో ప్రయాణించి ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాలని అనుకున్నారు. ఈ సారి మెక్ ఇంటైర్ శిఖరం పై నుంచి ఎగిరారు. కాగా, హామిల్టన్ మకాలు రిడ్జ్ లైన్‌లో ఓ రౌండ్ వేశారు.

ఈ సారి తీసిన ఫొటోలు పర్ఫెక్ట్‌గా వచ్చాయి. కానీ, 24 గంటల తర్వాత దాకా దీని గురించి వారు బయటకు ప్రకటన చేయలేదు. ఈ ప్లేట్లను హిల్లరీ, టెంజింగ్‌లు ఉపయోగించుకున్నారు. 1951లో వింగ్స్ ఓవర్ ఎవరెస్ట్ అనే సినిమా ఆస్కార్ గెలుచుకుంది.

హామిల్టన్ ధైర్య సాహసాలకుగాను ఎయిర్ ఫోర్స్ క్రాస్ అవార్డుతో సత్కరించింది. బ్లాకర్ ఆర్మీలో పీఐఏటీ (ఫేమస్ యాంటీ ట్యాంక్ వెపన్)హోదాలో సేవలు కొనసాగించారు. ఫాసిజం విజృంభించిన ఆ కాలంలో లూసీ లేడీ ఒంటరిగా మరణించారు. మెక్ ఇంటైర్ సివిల్ ఏవియేషన్‌లో కెరీర్ చూసుకున్నారు.

 

-- (అంచిత్ గుప్తా మిలిటరీ కుటుంబంలో జన్మించారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఈక్విటీ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. భారత వైమానిక చరిత్రలో ఆయనకు ఆసక్తి ఎక్కువ. అందుకే భారత వాయు సేన చరిత్రను పలు వేదికలపై పంచుకుంటుంటారు.)

Follow Us:
Download App:
  • android
  • ios